P Krishna
Actor Ravi Kishan Comments: బాలీవుడ్ నుంచి ఎంతోమంది నటులు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. రేసు గుర్రం మూవీలో మద్దాలి శివారెడ్డి అంటూ విలన్ గా నటంచాడు బోజ్ పూరి నటుడు రవి కిషన్
Actor Ravi Kishan Comments: బాలీవుడ్ నుంచి ఎంతోమంది నటులు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. రేసు గుర్రం మూవీలో మద్దాలి శివారెడ్డి అంటూ విలన్ గా నటంచాడు బోజ్ పూరి నటుడు రవి కిషన్
P Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది ఇతర భాష నటులు విలన్లుగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ సాధించారు. బోజ్‌పూరి ఇండస్ట్రీలో హీరోగా నటించిన రవి కిషన్ టాలీవుడ్ లోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం మూవీలో విలన్ గా నటించిన రవి కిషన్ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించారు. బోజ్ పురీ, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా వరుసగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన తర్వాత ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. బీజేపీ తరుపు నుంచి గోరఖ్‌పూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. తాజాగా రవి కిషన్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషన్ కి గురయ్యారు. వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ లో రేసు గుర్రం మూవీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ మూవీలో అల్లు అర్జున్ కి ధీటుగా నటించాడు రవి కిషన్. మద్దాలి శివారెడ్డి అంటూ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇటీవల రాజకీయాల్లో అడుగు పెట్టిన ఆయన గోరఖ్‌పూర్ ఎంపీగా సేవలందిస్తున్నాడు. రాజకీయాల్లో ఉంటూనే అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఈ మధ్యనే లాపట్ట లేడీస్ అనే మూవీలో కనిపించాడు. రవి కిషన్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా నాన్న సంప్రదాయాలంటే ఎంతో గౌరవించేవారు. నేను ఏదైనా తప్ప చేస్తే చితక్కోట్టేవాడు..ఎంతగా అంటే నన్ను చంపేంతగా, అలా ఓ రోజు నేను పొరపాటు చేస్తే చంపేస్తా అంటూ వెంటపడ్డారు. అది గమనించిన మా అమ్మ నన్ను ఇంటి నుంచి పారిపో అని చెప్పింది. వెంటనే 500 రూపాయలు జేబులో పెట్టుకొని ఇంటి నుంచి పారిపోయా ముంబై ట్రైన్ ఎక్కాను..ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను ’ అని అన్నారు.
మొదటి నుంచి నాన్నకు కోపం ఎక్కువ. ఆయన ఒక పూజారి.. బ్రహ్మణుడిగా నా కొడుకు పూజారి కావాలని కోరుకునేవాడు.. లేదా వ్యవసాయం చేయడమో, ప్రభుత్వ ఉద్యోగిగా అయినా స్థిరపడితే చూడాలని అనుకున్నారు. నాకు మాత్రం నటన అంటే ఇష్టం.. ఒకరోజు సీతా దేవి వేషంలో నటిస్తూ మా నాన్న కంట పడ్డాను. నాన్న కొట్టిన దెబ్బల వల్లే నా జీవితం ఇలా టర్న్ అయ్యింది. ఆయన కొట్టిన ప్రతి దెబ్బ నాకు జీవిత పాఠం నేర్పింది. ఈ రోజు మీ ముందు నటుడిగా నిలబడ్డాను. నేను నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత నాన్న ఎంతో గర్వంగా ఫీల్ అయ్యారు. ఆయన చావుకు దగ్గరైనపుడు ‘ నా కొడుకు ఈ స్థాయికి రావడం నేను తండ్రిగా ఎంతో గర్వపడుతున్నాను.. సంతోషంగా ఉంది’అంటూ కన్నుమూశారు అంటూ ఎమోషన్ అయ్యారు. ప్రస్తుతం రవి విషన్ మామ్లా లీగల్ హై వెబ్ సీరీస్ లో నటించాడు. ఈ సీరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతుది.