iDreamPost
android-app
ios-app

చిరంజీవి కోసం స్పెషల్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా CM..!

  • Published Feb 03, 2024 | 7:25 PM Updated Updated Feb 03, 2024 | 7:25 PM

ఈ ఏడాది పద్మ అవార్డులను ప్రకటించగా.. అందులో మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా ఉంది. ఆయనను దేశ రెండవ పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఈ నేపథ్యంలో ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం.

ఈ ఏడాది పద్మ అవార్డులను ప్రకటించగా.. అందులో మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా ఉంది. ఆయనను దేశ రెండవ పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఈ నేపథ్యంలో ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం.

  • Published Feb 03, 2024 | 7:25 PMUpdated Feb 03, 2024 | 7:25 PM
చిరంజీవి కోసం స్పెషల్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా CM..!

టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుల్లో చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. నటన, డ్యాన్సులతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని బాలీవుడ్ పాకేలా చేశారు. ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా ఆయన సినీ ప్రస్థానం సాగింది. సుప్రీమ్ హీరో నుండి మెగాస్టార్ గా ఎదిగారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. సినీ కళామతల్లికి ఆయన చేసిన సేవలకు గానూ సరైన గుర్తింపు లభించింది. దేశ రెండవ పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఆయనకు పద్మ విభూషణ్ రాగానే ప్రతి తెలుగోడి గుండెలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాయి. చిరుకి ఈ పురస్కారం వచ్చిన సందర్భంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వయంగా ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.

ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డు రావడంతో.. తెలంగాణ ప్రభుత్వం.. ప్రత్యేకంగా అభినందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అభినందన సభ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 4వ తేదీన శిల్పకళా వేదికలో ఓ ఈవెంట్ జరగనుందని సమాచారం. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేస్తుందట ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.  మెగాస్టార్ చిరంజీవిని ఆయన సత్కరించబోతున్నారట. అదే సమయంలో మరో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత వెంకయ్య నాయుడిని కూడా సత్కరించబోతున్నారని, ఈ మేరకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవితో సహా పలువురికి ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు తెలంగాణాలో పద్మశ్రీ అవార్డులు వరించిన వారిని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ సత్కరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానాలు పంపారట. చిరంజీవిని తెలంగాణ సర్కార్ సత్కరించబోతుందని తెలిసి మెగాస్టార్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాగా, కాస్త ఆలస్యంగా పాల్గొన్నారు అన్నయ్య. యువీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకుడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet