iDreamPost
android-app
ios-app

సినీ ఇండస్ట్రీలోనే సరికొత్త ప్రయోగం.. కుక్కతో డబ్బింగ్

కేజీఎఫ్, చార్లీ మూవీలతో కన్నడ ఇండస్ట్రీ కూడా పాన్ ఇండియన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ నేపథ్యంలో సరికొత్త ప్రయోగాలకు తెర లేపుతుంది. తాజాగా కనివినీ ఎరుగని రీతిలో..

కేజీఎఫ్, చార్లీ మూవీలతో కన్నడ ఇండస్ట్రీ కూడా పాన్ ఇండియన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ నేపథ్యంలో సరికొత్త ప్రయోగాలకు తెర లేపుతుంది. తాజాగా కనివినీ ఎరుగని రీతిలో..

సినీ ఇండస్ట్రీలోనే సరికొత్త ప్రయోగం..  కుక్కతో డబ్బింగ్

సినిమా ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వస్తోంది. కొత్త కొత్త టెక్నాలజీలను తీసుకు వచ్చి ప్రేక్షకులను కనువిందు చేస్తున్నారు. అలాగే చనిపోయిన నటీనటుల్ని కూడా తీసుకు వస్తున్నారు. అలాగే డబ్బింగ్ కూడా కొత్త పుంతలు తొక్కుతుంది. సాధారణంగా సినిమా కోసం తమ డబ్బింగ్ తాము చెప్పుకుంటారు. ఇక భాష రాని నటీనటులకు వేరొకరు గొంతు అరువు ఇస్తుంటారు. కానీ కుక్క డబ్బింగ్ చెప్పడం ఎక్కడైనా విన్నారా..? నిజమేనండి. వినడానికే వింతగా ఉన్న ఈ డబ్బింగ్ ఏ మూవీకి అనుకుంటున్నారా..? కన్నడ మూవీ కోసం. ‘నను మత్తు గుండా2’ అనే కన్నడ మూవీ కోసం కుక్కతో డబ్బింగ్ చెప్పించింది చిత్ర యూనిట్. ఈ విషయాన్ని దర్శకుడు వెల్లడించాడు. కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో వార్తల్లో నిలుస్తుంది. ఇంతకు ఈ సరికొత్త ప్రయోగం ఎందుకు చేశారంటే…?

2020లో థియేటర్లలో రిలీజైన నాను మత్తు గుండా మూవీకి స్వీకెల్‌గా రాబోతుంది నాను మత్తు గుండా. చార్లీ మూవీ లెవల్లోనే ఇది కూడా ఆటోడ్రైవర్, గుండా అనే అనాథ కుక్కని పెంచుకోవడం అనే కాన్సెప్టుతో తెరకెక్కింది. ఈ సినిమా హిట్ కొట్టడంతో దీనికి సీక్వెల్ తీస్తున్నారు. ఇందులో కుక్క చుట్టూ కథ అల్లుకోనుంది. శంకర్ మరణం తర్వాత గుండా ప్రయాణం ఎలా సాగుతుందో చూపించనున్నాడు దర్శకుడు రఘు హాసన్. ఇప్పటికే మైసూర్, చుట్టు పక్కల ఉన్నఅందమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిగింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇందులో భాగంగానే కనివినీ ఎరుగని రీతిలో ఓ కుక్క తన పాత్రకు డబ్బింగ్ చెప్పిందట. లాబ్రాడర్ జాతికి చెందిన సింబా అనే శునకంతో డబ్బింగ్ చెప్పించారు. రియాలిటీకి దగ్గరగా ఉండటం కోసం ఈ ప్లాన్ చేశారు మేకర్స్.

ఈ డబ్బింగ్ పనులు పూర్తయ్యాక.. టీమ్ డిజిటల్ ఇంటర్మీడియట్, రీ రికార్డింగ్ పనులను ప్రారంభిస్తారు. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించడం విశేషం. నాను మట్టు గుండా 2 పోయెమ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రుత్విక్ మురళీధర్ అందిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. కాగా, కుక్కతో డబ్బింగ్ చెప్పించడంతో మరోసారి కన్నడ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కేజీఎఫ్, చార్లీ వంటి చిత్రాలతో పాన్ ఇండియన్ గుర్తింపు తెచ్చుకున్న చందన సీమ.. సరికొత్త ప్రయోగాలకు నాంది పలుకుతుంది. ఇది సక్సెస్ అయితే.. భవిష్యత్తులో మరిన్ని జంతువులు కూడా తమ డబ్బింగ్ అవే చెప్పుకుంటాయేమో..!