Tirupathi Rao
Update On #90's Season 2: ప్రస్తుతం ఓటీటీలో దుమ్మురేపుతున్న మిడిల్ క్లాస్ బయోపిక్ సీజన్ 2 ఎప్పుడో డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు.
Update On #90's Season 2: ప్రస్తుతం ఓటీటీలో దుమ్మురేపుతున్న మిడిల్ క్లాస్ బయోపిక్ సీజన్ 2 ఎప్పుడో డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు.
Tirupathi Rao
ప్రస్తుతం ఓటీటీలు వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ లకు తెలుగు ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. భాషతో సంబంధం లేకుండా సిరీసుల మీద సిరీస్లు చూసేస్తున్నారు. అయితే ఇటీవల తెలుగు ప్రేక్షకులు బాగా చూసిన.. చూస్తున్న వెబ్ సిరీస ఏదైనా ఉంది అంటే.. #90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ అనే చెప్పాలి. ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి చాలామంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఐడ్రీమ్ మీడియాకు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలు పంచుకోవడం మాత్రమే కాకుండా.. సీజన్ 2కి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఈ వెబ్ సిరీస్ ని అనుకున్నప్పుడు ఇంతటి రెస్పాన్స్ వస్తుందని తాను అస్సలు అనుకోలేదని ఆదిత్య హాసన్ చెప్పుకొచ్చాడు. “ఇండస్ట్రీ నుంచి చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. నిజానికి నేను ఇంకా రియాలిటీలోకి రాలేదు. నిజంగా ఇందంతా జరుగుతోందా అనే పరిస్థితి ఉంది. ఫోన్లు, మెసేజులు, గొప్ప గొప్ప వారి నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ ని ముందు ఏదైతే కథ అనుకున్నానో అదే తీశాను. ఏ ఒక్కరి పాత్ర కోసం ఏ ఒక్క డైలాగ్ ని మార్చలేదు. కాస్టింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాం. నేను కచ్చితంగా 90’s హీరో హీరోయిన్ కావాలని అనుకున్నాను. అందుకు తగినట్లుగా శివాజీ, వాసుఖీ గారు దొరికారు.
రఘు పాత్రకు మౌళీని ముందే ఫిక్స్ అయ్యాను. వాసంతిక, రోహన్ రోయ్ లను ఆడిషన్స్ పెట్టే తీసుకున్నాం. రోహన్ కామడీ చేయగలడని నాకు తెలుసు. అందుకే వాడికి ఎమోషనల్ సీన్ ఇచ్చి చేయించాను. వాళ్లు అందరూ బోర్న్ ఆర్టిస్టులు. వారికి జస్ట్ సీన్ పేపర్ పంపిస్తే సరిపోతుంది. మేము సెట్స్ లో ఎక్కువగా ఫుడ్ గురించే డిస్కస్ చేస్తాం. కథ, షూట్ గురించి పెద్దగా చర్చలు జరగవు. కొన్ని సీన్స్ మాత్రం ఆన్ స్పాట్ ఇంప్రవైజ్ చేశాం. ఆదిత్య, రఘులను కొట్టి శివాజీ గారు వాసుఖీ గారితో పోయి బజ్జీలు వెయ్యి అన్న డైలాగ్ అక్కడే ఇంప్రవైజ్ చేశాం” అంటూ ఆదిత్య హాసన్ చెప్పుకొచ్చాడు.
#90’s సీజన్-2 గురించి ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీజన్ 1 ఎలా అయితే క్లోజ్ చేశారో.. సీజన్ 2 అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. రఘు ఇంటర్ గురించి సీజన్ 2 ఉంటుందన్నారు. అయితే ఫ్రెండ్ క్యారెక్టర్ కార్తిక్ విషయంలో మాత్రం ఇంకా ఏం అనుకోలేదు అన్నారు. కానీ, ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి కచ్చితంగా సీజన్ 2లో ఉండేలా చూద్దాం అన్నారు. అయితే తర్వాతి ప్రాజెక్టుగా సీజన్ 2 వస్తుందని చెప్పలేదు. ఎందుకంటే నెక్ట్స్ సీజన్ 2 కంటే ముందు ఒక మంచి లవ్ స్టోరీని రెడీ చేస్తున్నాను అన్నారు. ఈ వెబ్ సిరీస్ తో వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ ని అలాగే క్యారీ చేసేందుకు లవ్ స్టోరీని సెలక్ట్ చేసుకున్నాను అన్నారు. ఇప్పటికే కథ రెడీగా ఉండగా.. కాస్త మార్పులు చేర్పులు చేస్తున్నాను అన్నారు. దాదాపుగా హీరో కూడా ఓకే అయినట్లు చెప్పుకొచ్చారు. కాబట్టి #90’s సీజన్-2 సెట్స్ మీదకు రావడానికి కాస్త టైమ్ పడుతుంది. మరి.. #90’s వెబ్ సిరీస్ మీరు చూశారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.