నేషనల్ అవార్డ్స్​లో తెలుగు సినిమాలకు అన్యాయం.. అర్హత ఉన్నా దక్కని పురస్కారం!

National Film Awards 2024 Sita Ramam And Major Movies Upset: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు నుంచి ‘కార్తికేయ 2’ సినిమాకు అవార్డు దక్కింది. అయితే రెండు మూవీస్​కు మాత్రం అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

National Film Awards 2024 Sita Ramam And Major Movies Upset: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు నుంచి ‘కార్తికేయ 2’ సినిమాకు అవార్డు దక్కింది. అయితే రెండు మూవీస్​కు మాత్రం అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించే వారికి అవార్డులు, రివార్డులతో సత్కరిస్తుంటాయి పలు సంస్థలు. సినిమాల్లో విశేష ప్రతిభ చూపించే యాక్టర్స్, టెక్నీషియన్స్​కు పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంటాయి. అయితే ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులకు మాత్రం ఎంతో విశిష్టత ఉంది. సర్కారు ఇచ్చే పురస్కారాలను చాలా స్పెషల్​గా, గౌరవంగా భావిస్తుంటారు. నిన్న నేషనల్ అవార్డ్స్​ను సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. 2022, డిసెంబర్ 31వ తేదీ లోపు సెన్సార్ కంప్లీట్ అయిన ఫిల్మ్స్​ను పరిగణనలోకి తీసుకొని పురస్కారాలు కేటాయించారు. తెలుగు నుంచి ‘కార్తికేయ 2’ మూవీకి అవార్డు దక్కింది. బెస్ట్ తెలుగు ఫిల్మ్​గా నిలిచిందీ నిఖిల్ చిత్రం. అయితే రెండు టాలీవుడ్ మూవీస్​కు మాత్రం అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

‘సీతారామం’, ‘మేజర్’.. ఈ రెండు అద్భుతమైన సినిమాలకు నేషనల్ అవార్డుల్లో నిరాశే ఎదురైంది. సబ్జెక్ట్, కంటెంట్ పరంగా చూసుకుంటే ఇవి బెస్ట్ మూవీస్​గా పేరు తెచ్చుకున్నాయి. యాక్టింగ్ దగ్గర నుంచి అన్ని క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్​గా కుదిరిన చిత్రం ‘సీతారామం’. కానీ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో దీనికి నిరాశే ఎదురైంది. మరో సూపర్​హిట్ మూవీ ‘మేజర్’ ఓ సైనికుడి త్యాగాన్ని హానెస్ట్​గా చెప్పేందుకు ప్రయత్నించిన ఫిల్మ్. కమర్షియల్ యాంగిల్​కు దూరంగా, కథే ముఖ్యంగా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేసిన సినిమాలివి. స్టోరీ, స్క్రీన్​ప్లేతో పాటు నటన, టెక్నికల్ విభాగాల పనితీరు పరంగా చూసుకున్నా భేష్ అంటూ ప్రశంసలు అందుకున్న చిత్రాలివి. కానీ వీటికి జాతీయ అవార్డుల్లో మొండిచెయ్యి ఎదురైంది.

‘సీతారామం’ అన్ని క్రాఫ్ట్​లు వర్క్​ చక్కగా కుదిరిన సినిమా. అలాగే కమర్షియల్​గా కూడా బాగా వర్కౌట్ అయింది. ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్​తో పాటు మిగతా యాక్టర్స్​కు కూడా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా మృణాల్ తన లుక్స్, నటనతో అందర్నీ కట్టిపడేసింది. ఇలా అన్ని క్రాఫ్ట్​ల పరంగా టాప్ నాచ్ క్వాలిటీతో ది బెస్ట్​గా పేరు తెచ్చుకున్న ‘సీతారామం’కు అవార్డు వచ్చి ఉంటే తెలుగు వాళ్లు ఆనందించేవారు. ఇక, ‘మేజర్’ గురించి చెప్పాలంటే ఇదో సిన్సియర్ ఫిల్మ్. దేశం కోసం ఓ ఆర్మీ ఆఫీసర్ ప్రాణాలను లెక్క చేయకుండా హోటల్​లో ఉన్న బందీలను ఎలా కాపాడాడు? ఉగ్రవాదులతో ఎలా ఫైట్ చేశాడు? అనే రియల్ లైఫ్ స్టోరీని అంతే నిజాయితీతో తెరకెక్కించారు.

టెక్నికల్​గా గానీ కథ, ఎమోషన్స్ పరంగానూ గానీ ఎలాంటి సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా ఉన్నది ఉన్నట్లు చూపించిన సినిమా ‘మేజర్’. ఈ మూవీ మేకింగ్​ కోసం చాలా పర్మిషన్లు తీసుకున్నారు మేకర్స్. మేజర్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్​ను చాలా సార్లు కలిశారు. ఇది హానెస్టీతో కూడిన సినిమా. అలాంటి ‘మేజర్​’ను నేషనల్ అవార్డ్స్ కోసం కన్సిడర్ చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తమ చిత్రంగా కాకపోయినా మిగిలిన ఏదో ఒక కేటగిరీలో అయినా వీటికి అవార్డులు వచ్చి ఉంటే సంతోషించేవాళ్లమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అర్హత ఉన్నా ఈ చిత్రాలను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదని అంటున్నారు. మరి.. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘సీతారామం’, ‘మేజర్’కు అవార్డులు దక్కకపోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments