iDreamPost
android-app
ios-app

నిన్నటి దాకా ఈగలు తోలి.. ఆగస్ట్ 15కి 5 సినిమాలు! పెద్దలూ ఈ లెక్కేంటి?

  • Published Jul 22, 2024 | 7:16 PM Updated Updated Jul 22, 2024 | 7:16 PM

ఆగస్ట్ 15కి మాత్రం ఏకంగా 5 సినిమాలు వస్తుండటంతో.. సగటు సినిమా ప్రేక్షకులు ఒక్కింత అసహనానికి గురౌతున్నారు. అదేంటి? సినిమాలు రిలీజ్ అవుతుంటే సంతోష పడాలి గానీ.. ఇలా అసహనం దేనికి? మరి దీనికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగస్ట్ 15కి మాత్రం ఏకంగా 5 సినిమాలు వస్తుండటంతో.. సగటు సినిమా ప్రేక్షకులు ఒక్కింత అసహనానికి గురౌతున్నారు. అదేంటి? సినిమాలు రిలీజ్ అవుతుంటే సంతోష పడాలి గానీ.. ఇలా అసహనం దేనికి? మరి దీనికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నిన్నటి దాకా ఈగలు తోలి.. ఆగస్ట్ 15కి 5 సినిమాలు! పెద్దలూ ఈ లెక్కేంటి?

సినిమా.. కేవలం ప్రేక్షకులకు వినోదం పంచే వెండితెర బొమ్మగానే కనిపిస్తుంది. కానీ దాని వెనక ఎన్నో ఆర్థిక కష్ట, నష్టాలు ఉంటాయి. పైగా ప్రస్తుతం సినిమాలు తెరకెక్కించే, చూసే తీరు పూర్తిగా మారిపోయింది. దాంతో నిర్మాతలు సైతం అదే పంథాలో తమ మూవీస్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలో, ఎప్పుడు చేయకూడదో వారికి ఒక క్లారిటీ ఉంటుంది. అయితే 2024 తొలి అర్ధ భాగంలో భారీ సినిమాలు వచ్చిన దాఖలాలు లేవు. అలా వచ్చిన వాటిని వేళ్లమీద లెక్కబెట్టుకోవచ్చు. కానీ ఆగస్ట్ 15కి మాత్రం ఏకంగా 5 సినిమాలు వస్తుండటంతో.. సగటు సినిమా ప్రేక్షకులు ఒక్కింత అసహనానికి గురౌతున్నారు. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

2024 తొలి అర్ద భాగం పూర్తి అయిపోయింది. ఈ ఆరు నెలల్లో చూద్దామన్నా సినిమాలు రిలీజ్ కాలేదు. ఇక విడుదలైన పెద్ద సినిమాలను వేళ్ల మీద లెక్కబెట్టుకోవచ్చు. జనవరిలో సంక్రాంతి పండగ కాబట్టి ఎలాగో భారీగానే సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్ లు జనవరిలో విడుదల అయ్యాయి. ఆ తర్వాత విడుదలైన చెప్పుకొదగ్గ సినిమాల్లో పెద్ద హీరోల సినిమాలు లేవనే చెప్పుకొవాలి. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ లాంటి టైర్ టు హీరోల సినిమాలు రిలీజ్ అయ్యి అలరించాయి. మెుత్తంగా చూసుకుంటే జూన్ 27న విడుదలైన ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీనే భారీ బడ్జెట్ అండ్ స్టార్ హీరో సినిమా అని చెప్పాలి. ఈ ఆరు నెలలు ఈగలు తోలి.. ఇప్పుడు ఆగస్ట్ 15కి ఏకంగా 5 సినిమాలను ఒకే రోజు విడుదల చేస్తుండటంతో.. నిర్మాతలపై సినీ లవర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ లో ఇన్ని రోజులు చూద్దామన్నా.. సినిమాలు రిలీజ్ కాలేదు. జనవరిని మినహాయిస్తే, మిగతా 5 నెలలు దాదాపుగా వృథా అనే చెప్పాలి. థియేటర్లు అన్నీ ఖాళీగా మారిపోయాయి. ఎగ్జిబిటర్లు కరెంట్ బిల్లులు కట్టడానికి కూడా కష్టాలు పడ్డారు. ఆ టైమ్ లో మూవీస్ రిలీజ్ చేస్తే.. వారికి అంతో, ఇంతో సాయం అయ్యేది. కానీ ఇప్పుడు ఆగస్ట్ 15కి ఏకంగా 5 సినిమాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. రామ్-పూరిల డబుల్ ఇస్మార్ట్, రవితేజ-హరీష్ శంకర్ ల మిస్టర్ బచ్చన్, విక్రమ్-పా. రంజిత్ కాంబినేషన్ లో వస్తున్న తంగలాన్, నివేద థామస్ 35-చిన్న కథ కాదు,  మరో చిన్న చిత్రం ‘ఆయ్’ చిత్రాలు ఇండిపెండెంట్ కానుకగా రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అవుతున్న సినిమాలపై మంచి బజ్ ఉంది. ఇవే చిత్రాలు సోలోగా విడుదల అయితే.. మంచి కలెక్షన్లను రాబడతాయి. కానీ ఇప్పుడు వసూళ్లను షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇంత చిన్న లాజిక్ ను పెద్దలైన నిర్మాతలు ఎలా మిస్ అయ్యారు? మీ లెక్కలు ఏంటి? మాకైతే అర్ధం కావడం లేదంటున్నారు సినీ అభిమానులు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.