iDreamPost
android-app
ios-app

‘3’మూవీలో శృతి హాసన్ సిస్టర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్‌లో..!

  • Published Sep 13, 2024 | 6:31 PM Updated Updated Sep 14, 2024 | 12:58 PM

ధనుష్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ త్రీ.. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ఈ మూవీకి దర్శకురాలు. ఇందులో శృతి సిస్టర్ రోల్ చేసిన అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడెలా ఉందంటే..?

ధనుష్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ త్రీ.. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ఈ మూవీకి దర్శకురాలు. ఇందులో శృతి సిస్టర్ రోల్ చేసిన అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడెలా ఉందంటే..?

  • Published Sep 13, 2024 | 6:31 PMUpdated Sep 14, 2024 | 12:58 PM
‘3’మూవీలో శృతి హాసన్ సిస్టర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్‌లో..!

ధనుష్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ త్రీ. 2012లో తమిళ్, తెలుగు భాషల్లో రిలీజై పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. ధనుష్ మాజీ భార్య, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఈ మూవీకి దర్శకురాలు. ధనుష్ తన నటనతో అదరగొట్టేశాడు. తన ఫస్ట్ మూవీతోనే మ్యాజిక్ చేసేశాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. వై దిజ్ కొలవెరి డీ సాంగ్ అయితే యూట్యూబ్‌ను షేక్ చేయడమే కాదు.. ఖండాంతరాలు పాకేసింది. మిగిలిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. రామ్, జనని (ధనుష్, జనని) స్కూల్ డేస్ నుండి ప్రేమించుకుని, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంటారు. వీరి ప్రేమను సపోర్ట్ చేస్తుంది శృతి హాసన్ చెల్లులు సుమీ. ఇందులో డఫ్ అండ్ డబ్ అమ్మాయిగా నటించిన ఈ పాప ఎవరు.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

త్రీ మూవీలో శృతి హాసన్ చెల్లెలుగా నటించిన అమ్మాయి పేరు గాబ్రియెల్లా నటాలీ చార్ల్టన్. 1999లో పుట్టిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అయితే బిగ్ స్క్రీన్ అచ్చిరాకపోవడంతో బుల్లితెరకు షిప్ట్ అయ్యింది. గాబ్రియెల్లా తొమ్మిదో ఏట నుండి స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తుంది. స్టార్ విజయ్‌లో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో జోడి జూనియర్‌లో కనిపించింది ఈ అమ్మడు. అలా ఆమె పలు షోల్లో మెరిసింది. అలాగే స్టార్ విజయ్ రియాలిటీ డ్యాన్స్ సిరీస్ జోడి నంబర్ వన్ ఆరవ సీజన్‌లో పాల్గొని టైటిల్ సొంతం చేసుకుంది. అలా ఆమెకు త్రీలో నటించే అవకాశం వచ్చింది. త్రీలో సుమీగా మెప్పించిన ఆమె.. తర్వాత చెన్నైయిల్ ఒరు నాల్‌లో రియాగా కనిపించింది. మూడేళ్లకు హీరోయిన్ అయ్యింది. అప్పా చిత్రంలో రషిత పాత్రలో మెరిసింది.

Kid in 3 Movie

చదువులపై దృష్టి సారించడంతో ఓ ఐదు సంవత్సరాలు యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చింది గాబ్రియెల్లా. తనకు అచ్చొచ్చిన బుల్లితెరను నమ్ముకుని మళ్లీ బిగ్ బాస్ సీజన్ 4లో పార్టిసిపేట్ చేసింది. బిగ్ బాస్ ఫైనలిస్టుల్లో నిలిచి.. 5 లక్షల క్యాష్ ప్రైజ్ తీసుకుని బయటకు వచ్చింది. ఆ తర్వాత తమిళ బీబీ జోడీ సీజన్ 1లో పాల్గొని రన్నరప్ అయ్యింది. మెల్లిగా సీరియల్ కథానాయికగా మారి పోయింది. ఓ వైపు షోలు చేస్తూనే.. మరో వైపు ధారావాహికల్లో లీడ్ రోల్స్‌లో నటిస్తుంది. తాజాగా ఆమె మెయిన్ లీడ్‌లో మరుమగల్ అనే సీరియల్ చేస్తుంది. ఈ ధారావాహిక సన్ టీవీలో ప్రసారం అవుతుంది. రాహుల్ రవి, గాబ్రియెల్ ఈ కథకు మెయిన్ పిల్లర్స్. సినిమాకు దూరమైన ఈ చిన్నది.. బుల్లితెర ద్వారా ప్రతి ఒక్కరికీ చేరువైంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ.. అదరగొడుతుంది.  సినిమాల్లో చేయట్లేదు కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ బ్యూటీ ఆమె. ఏమంటారు..?

 

View this post on Instagram

 

A post shared by Gabriella (@gabriellacharlton_)

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet