iDreamPost
android-app
ios-app

కష్టాల్లో సింగర్.. రూ.25 లక్షల ఆర్థిక సాయం చేసిన అక్షయ్ కుమార్!

  • Published Jul 07, 2024 | 1:25 PM Updated Updated Jul 07, 2024 | 1:25 PM

Akshay Kumar: కొంతమంది హీరోలు రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లో కూడా హీరోలు అనిపించకుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. తన సంపాదనలో కొంతభాగం ఆర్మీకి డొనేట్ చేస్తుంటారు.. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల కోసం నా చిరు సాయం అంటారు.

Akshay Kumar: కొంతమంది హీరోలు రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లో కూడా హీరోలు అనిపించకుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. తన సంపాదనలో కొంతభాగం ఆర్మీకి డొనేట్ చేస్తుంటారు.. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల కోసం నా చిరు సాయం అంటారు.

  • Published Jul 07, 2024 | 1:25 PMUpdated Jul 07, 2024 | 1:25 PM
కష్టాల్లో సింగర్.. రూ.25 లక్షల ఆర్థిక సాయం చేసిన అక్షయ్ కుమార్!

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అక్షయ్ కుమార్ మొదటిసారిగా శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన రోబో 2.0 మూవీలో విలన్ గా నటించి మెప్పించారు. తర్వరలో మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్షయ్ కుమార్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హీరో అని పలు సందర్భాల్లో అనిపించుకున్నారు. కరోనా సమయంలో కోట్ల సాయం అందించారు.. ఆర్మీ ఫండ్ కి లక్షలు డొనేట్ చేస్తుంటారు. ప్రముఖ సింగర్ కి ఆర్థిక సాయం అందించి అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి మెప్పించారు అక్షయ్ కుమార్. ఒకప్పుడు యాక్షన్ మూవీస్ కే పరిమితం అయిన లక్షయ్ కొంత కాలంగా కామెడీ, ఫ్యామిలీ డ్రామా మూవీస్ లో నటిస్తున్నారు. అప్పట్లో అక్షయ్ ని బాలీవుడ్ జాకీ చాన్ అని అంటారు. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జాబితాలో అక్షయ్ ఒకరు. తాజాగా అక్షయ్ కుమార్ ప్రముఖ సింగర్ కి రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించారని బి టౌన్ లో వార్తలు వస్తున్నాయి. పంజాబ్ కి చెందిన పద్మ భూషన్ అవార్డు గ్రహీత సింగర్ గుర్మిత్ బవా కూతురు గ్లోరి బవా తన తల్లి చనిపోయిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో అక్షయ్ వెంటనే స్పందించారు.

అక్షయ్ కుమార్ తన మంచి మనసు చాటుకున్నారు.. గ్లోరీ గురించి వాకబు చేసి ఆమెకు ఏకంగా 25 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ విషయం గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘పద్మ భూషన్ అవార్డు గ్రహీత గుర్మిత్ బవా పంజాబ్ లో గొప్ప సింగర్..ఆమె పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఆమె కూతురు ఆర్ధిక కష్టాల్లో ఉన్నారని తెలియగానే చాలా బాధపడ్డాను. అందుకే ఒక అన్నయ్యగా ఆమెకు ఆర్థిక సాయం అందించాను’ అని అన్నారు. సోషల్ మీడియాలో అక్షయ్ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. అక్షయ్ గొప్ప మనసు చాటుకున్నాడని అభిమానులు, నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom