iDreamPost
android-app
ios-app

OTT Movies: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు..

ప్రతీ వారం లాగే ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తెలుగుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు భాషలకు చెందిన చిత్రాలు సందడి చేయనున్నాయి.

ప్రతీ వారం లాగే ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తెలుగుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు భాషలకు చెందిన చిత్రాలు సందడి చేయనున్నాయి.

OTT Movies: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు..

ఓటీటీ వాడకం నేడు నిత్యావసరం అయిపోయింది. చాలా మంది మొబైల్‌ ఫోన్‌ యూజర్లు రోజుకు ఒకసారైనా ఓటీటీలో సినిమా చూడందే నిద్రపోవటం లేదంటే అతిశయోక్తి కాదు. కరోనా ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంట్లో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుండటంతో.. ఓటీటీ వైపు మళ్లారు. కేవలం కొన్ని నెలల్లోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లకు పెద్ద సంఖ్యలో కస్టమర్లు రావటం మొదలైంది.

తర్వాత అది మిలియన్లకు చేరింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ఓటీటీ యూజర్లుగా ఉన్నారు. ప్రతీ రోజూ, ప్రతీవారం కొత్త కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, షోలు అందుబాటులోకి వస్తున్నాయి. కస్టమర్లు తమకు నచ్చిన భాషకు చెందిన సినిమాలను, వెబ్‌ సిరీస్‌లను చూస్తున్నారు. థియేటర్లలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు కొన్ని రోజులకే ఓటీటీలోకి వస్తున్నాయి. దీంతో ఓటీటీ యూజర్లు సినిమా థియేటర్లకు వెళ్లడానికి కూడా ఆలోచిస్తున్నారు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా తమకు యూజర్లను పట్టి ఉంచడానికి.. వారి అభిరుచులకు తగ్గ సినిమాలను, వెబ్‌ సిరీస్‌లను రిలీజ్‌ చేస్తున్నారు. ప్రతీవారం లాగే ఈ వారం కూడా కొత్త కొత్త సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. దాదాపు 21 మూవీలు పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో సందడి చేయనున్నాయి. వాటిలో తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు కూడా ఉన్నాయి. మెగా మేనళ్లుడు వైష్ణవ్‌ తేజ​, శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ కూడా ఓటీటీలోకి రానుంది.

నెట్‌ఫ్లిక్స్‌

  • క్యుకో(తెలుగు)
  • ఆదికేశవ ( తెలుగు)
  • రెబల్‌ మూన్‌ ( ఇంగ్లీష్‌)
  • మాస్ట్రో ( ఇంగ్లీష్‌)
  • సాజిని షిండేకా వైరల్‌ వీడియో(హిందీ)
  • ది మానీ ( స్పానిష్‌) నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌
  • కర్రీ అండ్‌ సైనెడ్‌ ( ఇంగ్లీష్‌)
  • ది టేమింగ్‌ ఆఫ్‌ ది ష్రుడ్‌ 2 ( పోలిష్‌)
  • లైక్‌ ఫ్లవర్స్‌ ఇన్‌ శాండ్‌ ( కొరియన్‌) సిరీస్‌
  • జియాంగ్‌ సెయింగ్‌ క్రియేటర్‌(కొరియన్‌) సిరీస్‌

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌

  • ది క్రియేటర్‌ ( ఇంగ్లీష్‌)
  • డ్రాగన్స్‌ ఆఫ్‌ వండర్‌ హాట్చ్‌ ( ఇంగ్లీష్‌)

ప్రైమ్‌ వీడియో

  • తగరు పాళ్య (కొరియన్‌)
  • బంకర్‌ ( ఇంగ్లీష్‌)
  • ఫ్లేమ్స్‌ సీజన్‌ 4 ( హిందీ)
  • అలయ్‌ మజ్య రషిలా( మరాఠీ)

ఆహా

  • కరీంనగర్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌ ( తెలుగు)

సోనీ లివ్‌

  • టోబీ( కొరియన్‌)

జీ5 సిరీస్‌

  • ఎన్‌సీఆర్‌ డేస్‌ సీజన్‌ 1( హిందీ)
  • హ్యూమరస్‌లీ యువర్స్‌ సీజన్‌ 3 (హిందీ)

జియో సినిమా

  • బార్బీ ( ఇంగ్లీష్‌)

మరి, ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న 21 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.