iDreamPost
android-app
ios-app

మూడు నెలల్లో 1000 కోట్ల బిజినెస్.. సినిమాల లెక్కలు గట్టెక్కుతాయా!

  • Published Oct 14, 2024 | 3:48 PM Updated Updated Oct 14, 2024 | 3:48 PM

ఈ ఏడాది తెలుగు థియేటర్స్ లో భారీగా బిజినెస్ చేసిన మూవీ కల్కి. ఇక ఈ ఏడాది మిగిలిన మూడు నెలలు కూడా దాదాపు 1000 కోట్ల బిజినెస్ చేయడానికి రెడీ అయిపోతుంది. దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

ఈ ఏడాది తెలుగు థియేటర్స్ లో భారీగా బిజినెస్ చేసిన మూవీ కల్కి. ఇక ఈ ఏడాది మిగిలిన మూడు నెలలు కూడా దాదాపు 1000 కోట్ల బిజినెస్ చేయడానికి రెడీ అయిపోతుంది. దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

  • Published Oct 14, 2024 | 3:48 PMUpdated Oct 14, 2024 | 3:48 PM
మూడు నెలల్లో 1000 కోట్ల బిజినెస్..  సినిమాల లెక్కలు గట్టెక్కుతాయా!

ఈ ఏడాది చిన్న సినిమాలదే హావ అని చెప్పి తీరాల్సిందే.  ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో అడుగుపెట్టిన సినిమాలన్నీ దాదాపు మంచి హిట్స్ ను అందుకున్నాయి. కానీ భారీ అంచనాలు మధ్యన రిలీజ్ అయినా కొన్ని స్టార్ హీరోల సినిమాలు మాత్రం బెడిసి కొట్టాయి. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజ్ అయినా సినిమాలాలో.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కాసుల వర్షం కురిపించిన మూవీ కల్కి. కల్కి తర్వాత దేవర ఆ రేంజ్ వసూళ్లను అందుకుంటుందని అంతా భావించారు. కానీ దేవర విషయంలో అది జరగలేదు. అయినా సరే మిక్స్డ్ టాక్ తో మొదలయ్యి ఈ రేంజ్ వసూళ్లను సాధించడం విశేషం. ఇక ఇప్పుడు రానున్న మూడు నెలల్లో తెలుగు థియేటర్స్ మార్కెట్ బిజినెస్ పెరగనుంది.

దేవర మ్యానియా దాదాపు ముగిసిపోతుంది. ఇక అందరి ఫోకస్ ఇప్పుడు తర్వాత రాబోయే సినిమాలా పైనే ఉంది. ఈ రెండు నెలలలో రిలీజ్ కు రెడీగా ఉన్న పెద్ద సినిమాలు అల్లు అర్జున్ పుష్ప-2 , సూర్య కంగువా.  ఈ రెండు సినిమాల మార్కెట్ 600 కోట్లు.. మిగిలిన సినిమాల మార్కెట్ 400 కోట్లు ఉండేలా ఉంది . అంటే ఈ మూడు నెలల్లో మొత్తంగా 1000 కోట్ల బిజినెస్ చూడొచ్చు. ఈ సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ లు కూడా బాగానే జరగనున్నాయి. ఎందుకంటే రాబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ , ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటున్నాయి. కాబట్టి వీటిపై బాగానే బజ్ ఉంది. సో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా.. ఈ మూడు నెలల్లోనే పెట్టిన ఖర్చు ను రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒకవేళ ఇప్పుడు కనుక మిస్ అయితే తర్వాత ఛాన్స్ ఏ ఉండదు. ఎందుకంటే సంక్రాంతికి ఆల్రెడీ మిగిలిన హీరోలు కర్చీఫ్ వేసుకున్నారు. ఫిబ్రవరి లో సినిమాలు రిలీజ్ చేసిన అంతగా సక్సెస్ అవ్వవు. ఇక మిగిలింది వచ్చే ఏడాది సమ్మర్. ఒకవేళ ఈ సినిమాలను అప్పటివరకు ఉంచితే.. సినిమాలపై పెట్టిన బడ్జెట్ వడ్డీలు అంతకు అంతకు పెరిగిపోతూ ఉంటాయి . అందుకే ,ఏదేమైనా ఈ మూడు నెలల్లోనే లెక్కలు తేల్చేయాలని వెయిట్ చేస్తున్నాయి అప్ కమింగ్ సినిమాలు.

మరి వచ్చే రెండున్నర నెలల్లో రిలీజ్ కాబోయే సినిమాలు ఎలాంటి టాక్ సంపాదించుకుంటాయో చూడాలి. ఆల్రెడీ పుష్ప-2 మీద బాగానే బజ్ ఉంది. ఎందుకంటే ఇది ఆగష్టు లోనే రిలీజ్ కావాల్సిన సినిమా. సో దీనికోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు దేవర గట్టి టార్గెట్ నే పెట్టి వెళ్ళింది. పుష్ప రాజ్ ఈ టార్గెట్ ను రీచ్ అవుతాడా లేదా కొత్త రికార్డ్స్ సృష్టిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మరి మిగిలిన చిన్న సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.