iDreamPost
android-app
ios-app

2023 సంక్రాంతి – వేడెక్కుతున్న పోటీ

  • Published May 21, 2022 | 6:09 PM Updated Updated May 21, 2022 | 6:18 PM
  • Published May 21, 2022 | 6:09 PMUpdated May 21, 2022 | 6:18 PM
2023 సంక్రాంతి – వేడెక్కుతున్న పోటీ

ఇంకా ఏడు నెలల సమయం ఉండగానే వచ్చే సంక్రాంతి గురించి చర్చలు మొదలయ్యాయి. ఏ సినిమాలు వస్తాయనే దాని మీద అభిమానుల మధ్య వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. ఎవరూ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వనప్పటికీ ప్రాధమికంగా దాని మీద కన్నేసిన స్టార్ హీరోలు గట్టిగానే ఉన్నారు. టాలీవుడ్ కు ఇది చాలా కీలకమైన సీజన్. మాములు సమయంలో యావరేజ్ అనిపించుకుని ఓ డెబ్భై కోట్లు వసూలు చేసే స్టార్ సినిమా ఆ టైంలో ఈజీగా నూటా యాభై కోట్ల దాకా వెళ్తుంది. బాక్సాఫీసు కు అంత స్టామినా ఉంటుంది, కరోనా వల్ల ఇబ్బందులొచ్చాయి కానీ లేదంటే ఆర్ఆర్ఆర్ అప్పుడు చెప్పిన డేట్ కి వచ్చి ఉంటే ఇంకో రెండొందల కోట్లు వచ్చేవి.

ఇక ఎవరొస్తారు అనే విషయానికి వస్తే తమిళ స్టార్ హీరో విజయ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న భారీ చిత్రం దాదాపు లాక్ అయినట్టే. ముందు రామ్ చరణ్ – శంకర్ ల ప్యాన్ ఇండియా మూవీ అనుకున్నారు కానీ అప్పటికంతా సిద్ధమయ్యేలా కనిపించకపోవడంతో సమ్మర్ కు షిఫ్ట్ చేశారని ఫిలిం నగర్ టాక్. ఆ కారణంగానే నిర్మాత దిల్ రాజు విజయ్ ది త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారట. పవన్ కళ్యాణ్ క్రిష్ ల కాంబోలో రూపొందుతున్న హరిహర వీరమల్లు జనవరి అయితేనే దానికి పెట్టిన బడ్జెట్ కు ఎక్కువ రెవిన్యూ వస్తుందనే ఆలోచనలో ఉన్నారు ఏఎం రత్నం. ఎలాగూ ఈ ఏడాది రిలీజ్ చేసే ఛాన్స్ లేదు.

ఈసారి రేస్ లో ఉండేందుకు చిరంజీవి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవేళ తమ్ముడు తప్పుకుంటే భోళా శంకర్ ని బరిలో దింపొచ్చు. ఎంత రొటీన్ ఎంటర్ టైనరైనప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందనే అంచనాతో ముందస్తుగా రెడీ అవ్వమని సంకేతాలు ఇస్తున్నారట. గాడ్ ఫాదర్ వచ్చేది ఎలాగూ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో. సో భోళా శంకర్ కి కావాల్సినంత గ్యాప్ ఉంటుంది. ఇక మహేష్ త్రివిక్రమ్ లు కూడా అదే టార్గెట్ చేశారు. ఇంకా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాకపోయినా ఆరు నెలల్లో ఫినిష్ చేసేలా షెడ్యూల్ వేస్తారట. ప్రభాస్ ఆది పురుష్ తో వస్తాడా రాదా అనేది సస్పెన్స్. ఒకవేళ ఫిక్స్ అయితే పైన వాటిలో ఒకరిద్దరు డ్రాప్ అవుతారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş