ఎఫ్3 మొదటి రోజు కలెక్షన్లు

నిన్న విడుదలైన ఎఫ్3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. టాక్ తో సంబంధం లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడంతో మొదటి రోజు చక్కని వసూళ్లు దక్కించుకుంది. సర్కారు వారి పాట స్లో అయ్యాక చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోవడంతో వెంకీ వరుణ్ లు తమ ఆట మొదలెట్టేశారు. ఎఫ్2 స్థాయిలో యునానిమస్ రిపోర్ట్స్ లేకపోయినా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నట్టు అధికశాతం రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి సినిమాలు మొదటి వీకెండ్ ఇలా పెర్ఫార్మ్ చేయడం సహజమే కానీ సోమవారం నుంచి కూడా ఇదే దూకుడు కనక కంటిన్యూ చేయగలిగితే రికార్డులు ఖాయం. ఇవాళ రేపు హౌస్ ఫుల్ బోర్డులు పడతాయనడంలో సందేహం అక్కర్లేదు

ఇక లెక్కల విషయానికి వస్తే ఎఫ్3 మొదటి రోజు 13 కోట్లకు పైగా షేర్ రాబట్టి వెంకటేష్ వరుణ్ తేజ్ ల ఫస్ట్ డే కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఎంతలేదన్నా శని ఆదివారాలు కనక ఈ స్పీడ్ ని హోల్డ్ చేయగలిగితే బ్రేక్ ఈవెన్ లో సగాన్ని ఈజీగా దాటేయవవచ్చు. కాకపోతే జూన్ 3న విక్రమ్, మేజర్, సామ్రాట్ పృథ్విరాజ్ లు ఉన్నాయి కాబట్టి వాటి వల్ల ఏ మేరకు ఎఫెక్ట్ అవుతుందో చూడాలి. నైజామ్ లో 4 కోట్లకు పైచిలుకు రాబట్టిన ఎఫ్3 ఆ ఏరియాలోనే స్ట్రాంగ్ గా ఉంది. టికెట్ ధరల ప్రభావం లేకపోయి ఉంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది కానీ ఈ ఎఫెక్ట్ మండే నుంచి ఖచ్చితంగా ఉంటుంది. యూనిట్ నిన్నటి నుంచే సక్సెస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టేసింది

నైజామ్ – 4 కోట్ల 5 లక్షలు
సీడెడ్ – 1 కోటి 25 లక్షలు
ఉత్తరాంధ్ర – 1 కోటి 15 లక్షలు
ఈస్ట్ గోదావరి – 75 లక్షలు
వెస్ట్ గోదావరి – 93 లక్షలు
గుంటూరు – 85 లక్షలు
కృష్ణా – 65 లక్షలు
నెల్లూరు – 60 లక్షలు

ఏపి తెలంగాణ మొదటి రోజు షేర్ – 10 కోట్ల 22 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 85 లక్షలు
ఓవర్సీస్ – 2 కోట్ల 15 లక్షలు

ప్రపంచవ్యాప్తంగాఫస్ట్ డే షేర్ – 13 కోట్ల 22 లక్షలు

ఎఫ్3కి జరిగిన థియేట్రికల్ బిజినెస్ 64 కోట్లకు దగ్గరలో ఉంది. ఇంకా 50 కోట్లకు పైగా షేర్ రావాల్సి ఉంది. ఇది అసాధ్యం కాదు కానీ టాక్ ఇంకో పదిరోజుల పాటు ఇలాగే ఉంటే చేరుకోవచ్చు. అనిల్ రావిపూడి నిర్మాత దిల్ రాజులు జరుగుతుందనే ధీమాలో ఉన్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో కొత్త తరహా ప్రమోషన్లు కూడా ప్లాన్ చేయబోతున్నారు. ఇది తప్ప కుటుంబ ప్రేక్షకులకు వేరే ఆప్షన్ లేకపోయిన అవకాశాన్ని వాడుకునేందుకు రెడీ అవుతున్నారు. ఎఫ్2 మించి ఆడుతుందా అంటే ఇప్పుడేం చెప్పలేం. పది రోజుల రన్ పూర్తి చేసుకుంటే క్లారిటీ వస్తుంది. రెండు ఓటిటి రిలీజుల తర్వాత బిగ్ స్క్రీన్ పై వచ్చిన వెంకీ దానికి తగ్గట్టే అదరగొడుతున్నారు.

Show comments