ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం మారిపోయింది. మారింది అనడం కంటే.. మార్చుకున్నారు అంటే బెటర్ ఏమో! థియేటర్స్ కి వెళ్లే ఆలోచనలు సగం మానుకున్నారు. ఒకవేళ థియేటర్స్ లో ఆడినా.. ఆఖరికి సినిమాలన్నీ ఓటిటిలోకే కదా రావాలి అనే ధీమా కూడా కనిపిస్తుంది. అదీగాక థియేట్రికల్ మూవీస్, ఓటిటి మూవీస్ అని డివైడ్ చేయడం కూడా మొదలుపెట్టేశారు. కానీ.. ఎన్ని ఓటిటిలు వచ్చినా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏది ఇవ్వలేదు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే.. వెండితెర కోసం తీసిన సినిమాలు ఆ స్క్రీన్ పై చూస్తూ.. ఆ సాంగ్స్, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేసే అవకాశం థియేటర్ లోనే దొరుకుతుంది.
అది వదిలేసి.. పాన్ ఇండియా సినిమాలు కూడా ఓటిటిలోకి ఎప్పుడు వస్తాయ్? అనే స్థాయిలో జనాలు ఆలోచిస్తున్నారు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.. జనాలు ఓటిటిలకు ఎంతగా అడిక్ట్ అయిపోయారో! ఇంకా వీళ్లకు తగ్గట్టుగా పదుల సంఖ్యలో ఓటిటి ప్లాట్ ఫాములు పుట్టుకొచ్చేసాయి. ఆల్రెడీ ఉన్నటువంటి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5, హాట్ స్టార్, ఆహా, సోనీలివ్.. ఇలాంటివి కాకుండా ప్రతీ భాషలో ఓటిటిలు వచ్చేసాయి. దీంతో థియేటర్ లలో చూడాల్సిన సినిమాలన్నీ ఓటిటిలలో చూసి చప్పట్లు కొడుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. ప్రతీ వీకెండ్ లాగే ఈ వీక్ కూడా చాలా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. ఏకంగా శుక్రవారం ఒక్కరోజే 15 సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అర్ధం చేసుకోండి.