iDreamPost
android-app
ios-app

త్రి పిన్ ప్లగ్‌లో మూడో పిన్‌ లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

  • Published Apr 10, 2024 | 4:13 PM Updated Updated Apr 10, 2024 | 4:13 PM

చాలా మంది ఇళ్లలో రోజు చూసే వస్తువులే.. కానీ వాటి గురించి.. దాని వలన ఉపయోగం ఏమిటో.. అవి లేకపోతే ఏమౌతుంది అనే విషయాలు మాత్రం ఎవరు పట్టించుకోరు. అటువంటి వాటిలో ఒకటి త్రి పిన్ ప్లగ్.

చాలా మంది ఇళ్లలో రోజు చూసే వస్తువులే.. కానీ వాటి గురించి.. దాని వలన ఉపయోగం ఏమిటో.. అవి లేకపోతే ఏమౌతుంది అనే విషయాలు మాత్రం ఎవరు పట్టించుకోరు. అటువంటి వాటిలో ఒకటి త్రి పిన్ ప్లగ్.

  • Published Apr 10, 2024 | 4:13 PMUpdated Apr 10, 2024 | 4:13 PM
త్రి పిన్ ప్లగ్‌లో మూడో పిన్‌ లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

ఇప్పుడు అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్, ఏసీ, కూలర్ ఇలా అన్ని పరిరకరాలు అనుబాటులోకి వచ్చేశాయి. అయితే ఇవన్నీ కూడా త్రీపిన్ ప్లగ్ తోనే సాకెట్ కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అసలు సాధారణంగా కరెంటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే.. దానికి ప్లస్, మైనస్ ఉంటాయన్న సంగతి అందరికి తెలుసు. ఇక వాటితో పాటు ఆ ప్లగ్స్ కు మూడవ పిన్ కూడా ఉంటుంది. ఇవన్నీ ప్రతి రోజు అందరూ ఇళ్లలో చూస్తూ ఉండేవే. అంతేకాకుండా ఈ మూడు పిన్స్ ఒకే పరిమాణంలో కూడా ఉండవు.. రెండు పిన్స్ ఒక పరిమాణంలో ఉంటే.. మూడవ పిన్ కాస్త పెద్దగా ఉంటుంది. ఇది విద్యుత్ ప్రవాహానికి రెండు పిన్స్ తోనే పని.. మరి ఈ మూడవ పిన్ దేనికి.. ఇది లేకపోతే అసలు ఏం జరుగుతుంది. దీనిని ఎవరు కనిపెట్టారు. దాని వలన కలిగే ఉపయోగాలేంటి అనే విషయాలను తెలుసుకుందాం.

సహజంగా ప్లగ్ కు ఉండే మూడు పిన్స్ లో రెండిటి ద్వారా మాత్రమే కరెంటు ప్రవహిస్తోంది. ఇక మూడవ పిన్ లోపల గ్రీన్ కలర్ వైర్ కనెక్ట్ చేస్తారు. దీనిని ఎర్త్ వైర్ అంటారు. అంటే ఇది ఎర్త్ కు కనెక్ట్ అయ్యి ఉండే వైర్ గా ఉపయోగిస్తారు. దీనిలో కరెంటు అయితే ప్రవహించదు. ఇందులో ఉండే వైర్ యొక్క మరొక ఎండ్ .. మనం ఉపయోగించే విద్యుత్ పరికరాలకు కనెక్ట్ చేసి ఉంటుంది. ఇలా ఒక ఎండ్ ఎర్త్ కు మరొక ఎండ్ విద్యుత్ ఉపకరణాలకు కనెక్ట్ చేయడం ద్వారా.. ఉపయోగించే వస్తువులకు ఏ హాని జరగదు. దీనినే ఎలక్ట్రిక్ గ్రౌండింగ్ అంటారు. పైగా ఇది విద్యుత్ ఉపకరణాలను కాపాడడమే కాకుండా.. కరెంటు షాక్ నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి విద్యుత్ ప్రవాహాలలో హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి.. దీని నుంచి కూడా ఈ ఎర్త్ పిన్ విద్యుత్ పరికరాలను కాపాడుతుంది. అందుచేతనే పెద్ద విద్యుత్ పరికరాలను ఖచ్చితంగా గ్రౌండింగ్ చేస్తూ ఉంటారు.

ఈ ఎర్తింగ్ విధానాన్ని ఎవరు కనిపెట్టారు ఏంటి అనే విషయానికొస్తే.. ఈ త్రి పిన్ ప్లగ్ సాకెట్ ను 1904లో హార్వే హబ్బేల్ అనే వ్యక్తి కనిపెట్టారు. దానికంటే ముందు వరకు కూడా ఈ విధానం అనేది ఎక్కడా లేదు. 1904 లో ఈ త్రి పిన్ ప్లగ్ ను కనిపెట్టి.. ఆ తర్వాత దానిపై పేటెంట్ ను పొందాడు. క్రమంగా 1915 నాటికీ ప్లగ్ తో పాటు సాకెట్ ను కూడా తయారు చేసి.. వాటిని కంపెనీలకు విక్రయించడం ప్రారంభించాడు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నివేదికల ప్రకారం.. ఐదు యాంపియర్స్ కంటే ఎక్కువ విద్యుత్ ఉపయోగించే ఏ ఎలక్ట్రిక్ వస్తువుకైనా కూడా.. ఈ త్రి పిన్ ప్లగ్ ను వాడాలి. కాబట్టి ఎలక్ట్రిక్ వస్తువులను కాపాడేందుకు, ఎలక్ట్రికల్ షాక్ నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ త్రి పిన్ ప్లగ్ అనేది ఉపయోగపడుతుంది . మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.