iDreamPost
android-app
ios-app

Summer Precautions: మండుటెండల్లో మీ ఇంట్లో చల్లగా ఉండాలంటే.. ఇలా చేయండి

  • Published Mar 29, 2024 | 4:55 PM Updated Updated Mar 29, 2024 | 4:55 PM

వేసవి కాలం రానే వచ్చింది. ఇక చాలా మంది బయటకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుందాం అన్నా కూడా.. ఆ వేడికి ఉండలేరు. అయితే.. మీరు మీ ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.

వేసవి కాలం రానే వచ్చింది. ఇక చాలా మంది బయటకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుందాం అన్నా కూడా.. ఆ వేడికి ఉండలేరు. అయితే.. మీరు మీ ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.

  • Published Mar 29, 2024 | 4:55 PMUpdated Mar 29, 2024 | 4:55 PM
Summer Precautions: మండుటెండల్లో మీ ఇంట్లో చల్లగా ఉండాలంటే.. ఇలా చేయండి

వేసవి కాలం ఇంకా పూర్తిగా మొదలుకాక మునుపే.. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక పూర్తిగా మొదలైందంటే మాత్రం ప్రజలు ఆ వేడికి తట్టుకోలేరు అని చెప్పడంలో .. ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక ఇళ్లలో ఉండే ప్రజలంతా ఆ వేడికి తట్టుకోలేక ఏసీలు, కూలర్ లు కొనుగోలు చేస్తూ ఉంటారు. కొన్నాము కదా అని 24 గంటలు వాటిని ఆన్ లో ఉంచలేరు. ఎందుకంటే.. కరెంట్ బిల్లు పెరిగిపోతూ ఉంటాయి. పైగా అందరికి ఆ స్థోమత ఉండకపోవచ్చు. కాబట్టి అందరికి సులువుగా ఉండేలా.. సహజంగా ఇంటిని ఎలా చల్లగా ఉంచుకోవాలో తెలుసుకుందాం. వీటిని కనుక ఫాలో అయితే.. కొంతవరకు ఇంటిని చల్లగా ఉంచుకునే అవకాశం ఉంటుంది.

ముందుగా ఇల్లు చల్లగా ఉండాలంటే.. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉంటుంది.
1) ముఖ్యంగా ఇళ్లలో ఉన్న బల్బులను మార్చాల్సి ఉంటుంది. ట్యూబ్ లైట్లు స్థానంలో .. ఎల్ఈడి లైట్లను పెట్టుకోవడం వల్ల శక్తి ఆదా
అవుతుంది. దీని వలన ఇంట్లో ఓ మేరకు ఉష్ణోగ్రత తగ్గుతుంది.
2) ఇక ఇంట్లో ఉన్నపుడు కాటన్ దుస్తులు ధరించడం వలన.. శరీరం చల్లబడి.. కాస్త ప్రశాంతంగా ఉంటుంది.
3) అలాగే.. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి.. వాటిలో ఐస్ క్యూబ్స్ ఉంచి గదిలో ఒక మూలాన ఉంచితే.. ఫ్యాన్ వేసినపుడు ఆ గాలి ఆ
చల్లదనాన్ని లాక్కోవడం వలన ఇల్లు చల్లగా ఉంటుంది.
4) ఇక ఇంట్లో చాలా గదులు ఉన్నపుడు.. ఎక్కువగా వాడే గదిని వదిలేసి.. మిగతా గదులకు తలుపులు వేసేయాలి. దాని వలన వేడి
తీవ్రత కొంచెం తగ్గుతుంది.
5) ఇక ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్స్ .. వేసవి సమయంలో క్లాక్ వైస్ లో కాకుండా యాంటీ క్లాక్ వైస్ లో తిరిగేలా సెట్ చేయాలి. దీని వలన
కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది.
6) ఇక ఖచ్చితంగా ఏసీ ఉపయోగించాల్సి వస్తే.. ఏసీలో 24నుంచి 27 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత మధ్య మాత్రమే ఉండేలా సెట్ చేసుకోవాలి.
అంతకంటే తక్కువ ఉంటే మాత్రం.. శరీరానికి ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
7) ఇక ఇంటి చుట్టూ.. వీలైనన్ని ఎక్కువ మొక్కలను పెంచేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే కిటికీల వద్ద.. గుమ్మలా వద్ద పూల
కుండీలు పెట్టేందుకు ప్రయత్నించండి.
8) ఇక ఎప్పటికప్పుడు శరీరాన్ని హైడ్రాటెడ్ గా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. వేడిగా ఉండే ఆహారాలు తినడం తగ్గించాలి. మజ్జిగ,
నిమ్మరసం వంటివి నిరంతరం తాగుతూ ఉండాలి.

ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక పాటిస్తూ ఉంటే .. కొంతవరకు ఎండ తీవ్రత నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటపుడు కూడా.. ఎండ తీవ్రతను బట్టి.. ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్దులు ఈ ఎండల తీవ్రతను తట్టుకునేలా.. వారి ఆహార విషయాల్లో జాగ్రత్తాగా చూసుకుంటూ ఉండాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.