బురదలో అడుగుపెట్టినా మీ షూస్ పాడవ్వవు.. వర్షాల్లో ఉపయోగపడే షూ కవర్స్

Waterproof Shoe Cover which Protects Your Shoes From Mud, Rainwater: ఎంతో రేటు పెట్టి షూస్ కొని ఉంటారు. వర్షాలు పడినప్పుడు బురద నీటిలో అడుగుపెట్టడం వల్ల షూస్ పాడైపోతాయి. పైగా అసహ్యం కూడా. బురదలో అడుగుపెట్టిన ప్రతిసారీ షూస్ ఉతుక్కోవాలంటే కష్టమే. కాబట్టి ఇలాంటి సమస్యలకు పరిష్కారమే ఈ షూ ప్రొటెక్షన్ వాటర్ ప్రూఫ్ కవర్స్. ఇవి ఉంటే మీ షూస్ అస్సలు పాడవ్వవు.

Waterproof Shoe Cover which Protects Your Shoes From Mud, Rainwater: ఎంతో రేటు పెట్టి షూస్ కొని ఉంటారు. వర్షాలు పడినప్పుడు బురద నీటిలో అడుగుపెట్టడం వల్ల షూస్ పాడైపోతాయి. పైగా అసహ్యం కూడా. బురదలో అడుగుపెట్టిన ప్రతిసారీ షూస్ ఉతుక్కోవాలంటే కష్టమే. కాబట్టి ఇలాంటి సమస్యలకు పరిష్కారమే ఈ షూ ప్రొటెక్షన్ వాటర్ ప్రూఫ్ కవర్స్. ఇవి ఉంటే మీ షూస్ అస్సలు పాడవ్వవు.

వర్షాకాలం వచ్చిందంటే రోడ్లు నిండిపోతాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే రోడ్ల మీద మురుగు నీరు వచ్చి చేరుతుంది. వర్షాకాలం అనే కాదు మిగతా సీజన్స్ లో కూడా అప్పుడప్పుడు రోడ్ల మీద మురుగు నీరు ప్రవహిస్తుంటుంది. ద్విచక్ర వాహనాల మీద ప్రయాణం చేసే వారికి మురుగు నీటిలో అడుగుపెట్టాలంటే అసహ్యం వేస్తుంది. షూస్, సాక్స్ పాడైపోతాయి. ఆ నీరు షూస్ మీద, సాక్సుల మీద తూలుతాయి. కొన్నిసార్లు బూట్లు మునిగిపోయేలా రోడ్ల మీద నీరు నిలిచిపోతుంది. అలాంటప్పుడు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఖరీదైన షూస్ పాడైపోతాయి. దీనికి తోడు ఉతికినా గానీ త్వరగా ఆరవు. ఇలాంటి పరిస్థితుల్లో షూస్ ప్రొటెక్షన్ కవర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ తో వస్తుంది. కాబట్టి వర్షానికి తడిచినా గానీ షూస్ కి నీళ్లు తగలవు. బురదలో, మురుగు నీటిలో పొరపాటున అడుగు పెట్టినా గానీ షూస్ కి కొంచెం కూడా మరక అనేది అంటుకోదు. దీంతో మీరు హ్యాపీగా, రిలాక్స్డ్ గా ఉండచ్చు. 

వాటర్ ప్రూఫ్ సిలికాన్ షూ కవర్స్ అనేవి ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి అరికాలి నుంచి 10 అంగుళాలు, 13 అంగుళాల పొడవు ఉంటాయి. మీ సౌకర్యాన్ని బట్టి ఎంత పొడవు ఉండాలో అనేది నిర్ణయించుకోవచ్చు. ఇవి షూస్ లానే ఉంటాయి. కానీ షూస్ ని ఈ కవర్స్ పెట్టుకుని భద్రంగా ఉంచుకోవచ్చు. షూస్ ని కవర్ లో పెట్టిన తర్వాత బటన్స్ పెట్టాలి. అప్పుడు మీరు కంఫర్ట్ గా నడవచ్చు. ఇందులో చాలా మోడల్స్, చాలా రంగులవి ఉన్నాయి. యాంకిల్ లెంత్ వాటర్ ప్రూఫ్ షూ కవర్, యాంకిల్ పైకి ఎక్కువ లెంత్ ఉన్నవి ఉన్నాయి. షూస్ కలర్ ని బట్టి తెలుపు, నలుపు వంటి రంగులను ఎంచుకోవచ్చు. పలుచగా ఉండేవి, మందంగా ఉండేవి ఉన్నాయి. అలానే మీ ప్యాంట్ పాడవకుండా ఉంచే షూస్ కవర్స్ కూడా ఉన్నాయి.

మోకాలి వరకూ వచ్చే షూస్ కవర్స్ ఉన్నాయి. ఇవి షూస్ కే కాకుండా మోకాలి కింద భాగంలో ప్యాంటుని బురదలో అడుగుపెట్టినా పాడవ్వనివ్వదు. ఇంటికి వెళ్ళాక ఆ షూస్ కవర్స్ ని తీసేసుకోవచ్చు. సిలికాన్ షూస్ కవర్స్ ని అయితే వర్షాకాలంలో అలానే ఉంచేసుకోవచ్చు. లేదా ఎప్పటికీ అలానే ఉంచేసుకున్నా షూస్ భద్రంగా ఉంటాయి. ఇందులోనే వేరేవి కూడా ఉన్నాయి. బాగా పలుచని షూస్ కవర్స్. ఇవి 20 జతలు, 10 జతలు ఉంటాయి. ఒకసారి వాడి పడేయాల్సి ఉంటుంది. ఒకవేళ బాగుంటే రెండు, మూడు సార్లకు వాడుకోవచ్చు. వీటి ధర విషయానికొస్తే రకాన్ని బట్టి 270 రూపాయల నుంచి 5 వందలు, 6 వందలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు ఇలా ఉన్నాయి. అయితే కంఫర్ట్ కోరుకునే వారు లెంత్ ఎక్కువ ఉన్న షూస్ కవర్స్ కొనుక్కోవడం మంచిది. పైగా ఇవి చాలా తేలికగా ఉంటాయి.      

Show comments