nagidream
వేసవి కాలంలో పుచ్చకాయ, మామిడి పండ్లు తింటే హెల్త్ కి చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ పుచ్చకాయ, మామిడి పండ్లు కొనుక్కుంటూ ఉంటారు. అయితే పండును పై పైన చూసి టేస్ట్ ఎలా ఉందో అనేది తెలుసుకోవడం చాలా కష్టం. అయితే దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి పాటిస్తే ముగ్గిన పండుని, తీపి పండుని ఎంచుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.
వేసవి కాలంలో పుచ్చకాయ, మామిడి పండ్లు తింటే హెల్త్ కి చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ పుచ్చకాయ, మామిడి పండ్లు కొనుక్కుంటూ ఉంటారు. అయితే పండును పై పైన చూసి టేస్ట్ ఎలా ఉందో అనేది తెలుసుకోవడం చాలా కష్టం. అయితే దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి పాటిస్తే ముగ్గిన పండుని, తీపి పండుని ఎంచుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.
nagidream
వేసవి కాలంలో మామిడి పండ్లు, పుచ్చకాయలు తినాలని అందరూ అనుకుంటారు. అయితే వీటిలో మంచివి ఎలా ఎంపిక చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. ముందు స్వీట్ పుచ్చకాయలను ఎలా ఎంచుకోవాలో చూద్దాం. పుచ్చకాయ తియ్యగా ఉందో లేదో తెలుసుకోవాలంటే ముందు మీరు దాని ఆకారాన్ని చూడాల్సి ఉంటుంది. దాదాపుగా గుండ్రంగా ఉండే పుచ్చకాయలు తియ్యగా ఉంటాయి. కోడి గుడ్డు ఆకారంలో ఉండే పుచ్చకాయ తక్కువ తియ్యదనం కలిగి ఉంటాయి. అలానే నీరు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆ తర్వాత చూడాల్సింది పుచ్చకాయ బరువు. ఎక్కువ బరువు ఉన్న పుచ్చకాయ ఎక్కువ నీరు, రుచికరంగా ఉంటుంది. ఒకే సైజులో కనిపించే రెండు పుచ్చకాయలు పట్టుకుని అందులో బరువుగా ఉన్నది తీసుకుంటే మీరు మంచి పుచ్చకాయను ఎంచుకున్నట్టు. ఇక ఆ తర్వాత చూడాల్సింది రంగుల చారలు. పుచ్చకాయలో ఉండే రంగులతో కూడా మంచి రుచికరమైన పండిన దాన్ని ఎంచుకోవచ్చు. స్ట్రాంగ్ మరియు స్థిరమైన చార కలిగి ఉన్న పుచ్చకాయ తియ్యగా ఉంటుంది.
డీప్ గ్రీన్, డార్క్ గ్రీన్ లో ఉండి లేత క్రీమ్ కలర్, లేత పసుపు రంగులో ఉంటే ఆ పుచ్చకాయలు మంచివన్నట్టు. లేత ఆకుపచ్చ రంగులో ఉంటే కనుక అది మంచి పుచ్చకాయ కాదని అర్థం. చూడ్డానికి డల్ గా కనిపించే పుచ్చకాయ కూడా మంచిదే. అయితే బాగా మెరిసే పుచ్చకాయను తీసుకుంటే మీరు మోసపోయినట్టే. ఎందుకంటే అది ఇంకా పండని పండు అని అర్థం. లేత పసుపు రంగు లేదా లేత నారింజ రంగులో ఉంటే కనుక అది బాగా పండిందని అర్థం. పుచ్చకాయ మీద తెల్లగా ఉంటే కనుక దాన్ని త్వరగా కోసినట్టు, ఇంకా పండనట్టు అర్థం. కట్ చేసిన పుచ్చకాయ ముక్కను తీసుకుంటే కనుక ఎరుపు ఎక్కువగా ఉండి, తెలుపు భాగం తక్కువగా ఉన్న దాన్ని తీసుకోండి. అదైతేనే తియ్యగా ఉంటుంది. పుచ్చకాయ కాండం ఎండిపోయినట్టు లేదా నలుపు రంగులో ఉంటే కనుక అది ఎలాంటి రసాయనాలు లేకుండా సహజంగా పండినట్టు.. అలానే తియ్యగా కూడా ఉంటుంది. అదే కాండం పచ్చగా ఉంటే త్వరగా కోసేసినట్టు అర్థం. పుచ్చకాయ మీద తేనె పట్టు రంగు మచ్చలు (షుగర్ స్పాట్స్) ఎక్కువగా ఉంటే కనుక ఆ పుచ్చకాయ బాగా పండినట్టు. ఎక్కువ తియ్యగా ఉంటుంది. ఇక ఈ పుచ్చకాయలను అవి దొరికే సీజన్ లో తీసుకుంటేనే తియ్యనివి దొరుకుతాయి.
మామిడి పండ్లు రకాలను బట్టి పచ్చ, నారింజ, ఎరుపు, ఊదా, పసుపు రంగులో ఉంటాయి. అయితే పసుపు రంగులో ఉన్న మామిడి పండ్లు ఎక్కువ తియ్యగా ఉంటాయి. అలానే మామిడి పండుని చేతితో నొక్కినప్పుడు కొద్దిగా మాత్రమే మెత్తగా ఉండాలి. మరీ మెత్తగా ఉండకూడదు. కాండం చివర తీపి, పండిన వాసన వస్తుంది. అది మంచి తియ్యని మామిడి పండు అన్నట్టు. అదే కాండం చివర పుల్లని వాసన, ఆల్కహాల్ వాసన వస్తే కనుక అది పాడైన పండు అని అర్థం. మంచి మామిడి పండు అంటే అది ఫుట్ బాల్ ఆకారంలో బొద్దుగా, గుండ్రంగా ఉంటుంది. ముఖ్యంగా కాండం చుట్టూ ఇలా ఉంటుంది. ఫ్లాట్ గా (చదునుగా) ఉండేవి, సన్నగా, ముడతలు పడినవి.. ముడుచుకున్నట్టు ఉండే మామిడి పండ్లను కొనకపోవడమే మంచిది. అవి అస్సలు బాగోవు. మరి రుచికరమైన, తియ్యనైన పుచ్చకాయలు, మామిడి పండ్లను ఎలా ఎంపిక చేసుకోవాలి తెలిసింది కదా. మరి ఈ కథనం ఉపయోగపడుతుందని మీరు భావిస్తే ఇతరులకు షేర్ చేయండి. అలానే మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.