iDreamPost
android-app
ios-app

కెమికల్స్‌తో పండించిన మామిడి పండ్లు తింటున్నారా? ప్రాణాలకే ముప్పు!

  • Published May 21, 2024 | 5:53 PM Updated Updated May 21, 2024 | 6:17 PM

కెమికల్స్ తో పండించే మామిడి పండ్లు తింటే క్యాన్సర్ లాంటి మహమ్మారి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మామిడి పండ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరి కెమికల్స్ కలిసిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలి?

కెమికల్స్ తో పండించే మామిడి పండ్లు తింటే క్యాన్సర్ లాంటి మహమ్మారి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మామిడి పండ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరి కెమికల్స్ కలిసిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలి?

కెమికల్స్‌తో పండించిన మామిడి పండ్లు తింటున్నారా? ప్రాణాలకే ముప్పు!

సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు మామిడి పండ్ల కోసం జనం ఎగబడతారు. దీంతో డిమాండ్ ఏర్పడుతుంది. ఈ కారణంగా సహజంగా మండే మామిడి పండ్ల కంటే ఎక్కువగా రసాయనాలతో పండించిన మామిడి పండ్లే ఎక్కువగా కనబడతాయి. రసాయనాలతో పండించిన మామిడి పండ్లు తింటున్నారా? అయితే ప్రాణాలకు ముప్పు వాటిల్లడం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెమికల్స్ తో పండించిన మామిడి పండ్లు తినడం వల్ల పొట్ట ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. కాల్షియం కార్బైడ్ అనే రసాయనం కలిపి మామిడి పండ్లను పండిస్తారు. ఈ కెమికల్ నరాలపై దుష్ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగా తలనొప్పి, అలసట, నరాల సమస్యలు, అధికంగా నిద్రపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పాలిచ్చే తల్లులు ఈ కెమికల్స్ తో పండించిన మామిడి పండ్లను అస్సలు తినకూడదు. ఎందుకంటే కాల్షియం కార్బైడ్ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 

కాల్షియం కార్బైడ్ వాడకంపై నిషేధం:

ఆహార ఉత్పత్తుల్లో కాల్షియం కార్బైడ్ వాడకాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిషేధించింది. దీన్ని బట్టి అది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. పండ్లను సహజంగా మగ్గబెడితే పర్లేదు కానీ కొంతమంది త్వరగా పనైపోవాలని చెప్పి కాల్షియం కార్బైడ్ రసాయనాన్ని వాడుతున్నారు. అయితే ఈ కెమికల్ తో మగ్గబెట్టిన పండ్లను వాడొద్దని ట్రేడర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ వార్నింగ్ ఇచ్చింది. కెమికల్ కలిసిన మామిడి పండ్లు తింటే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని.. కాబట్టి నిషేధాన్ని పాటించాలని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు, పండ్ల ట్రేడర్లకు, హ్యాండ్లర్లకు స్పష్టంగా పేర్కొంది. కృత్రిమంగా మగ్గబెట్టేలా ఉంటే కాల్షియం కార్బైడ్ కి బదులు ఇథైలిన్ గ్యాస్ వాడేందుకు అనుమతి ఇచ్చింది. 100పీపీఎం గాఢత వరకూ ఈ ఇథైలిన్ గ్యాస్ ను వాడవచ్చునని తెలిపింది.  

Mangoes    

కాల్షియం కార్బైడ్ కలిపిన మామిడి పండ్లను గుర్తించడం ఎలా?:

మామిడి పండ్లపై నల్లటి మచ్చలు ఉంటే కనుక అవి కాల్షియం కార్బైడ్ రసాయనం కలిపినవని గుర్తించాలి. అలానే మామిడి పండ్లను ఒక నీటి బకెట్ లో వేయండి. పండ్లు మునిగితే సహజంగా పండినవని అర్థం. నీటిలో తేలితే కనుక అవి కెమికల్ పౌడర్ పూసిన మామిడి పండ్లుగా గుర్తించాలి. కెమికల్ పౌడర్ కలిపిన మామిడి పండు మొదలు భాగం పండదు. పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ప్యాచెస్ లా మచ్చలు కనిపిస్తాయి. మామిడి పండు పై భాగంలో పసుపు, పచ్చ రంగు అతుకులుగా కాకుండా ఏకరీతిలో ఒకేలా ఉంటుంది. కెమికల్ కలిపిన పండ్లలో రసం తక్కువగా ఉండదు. పండ్ల ఆకృతి, రంగుని బట్టి కూడా మంచి సహజంగా పండిన మామిడి పండ్లను గుర్తించవచ్చు.

మామిడి పండ్లు రకాలను బట్టి పచ్చ, ఎరుపు, నారింజ, ఊదా, పసుపు రంగులో ఉంటాయి. అయితే వీటిలో పసుపు రంగులో ఉన్న మామిడి పండ్లు ఎక్కువ తియ్యగా ఉంటాయి. ఫుట్ బాల్ ఆకారంలో బొద్దుగా, గుండ్రంగా ఉండే మామిడి పండ్లు సహజంగా పండినవి. చదునుగా ఉండేవి, సన్నగా, ముడతలు పడినవి.. ముడుచుకున్నట్టు ఉండే మామిడి పండ్లు అస్సలు బాగోవు. అలానే మామిడి పండుని చేతితో నొక్కినప్పుడు కొద్దిగా మాత్రమే మెత్తగా ఉండాలి. మరీ మెత్తగా ఉంటే అది మంచిది కాదు. కాండం చివర తీపి, పండిన వాసన వస్తే అది మంచి తియ్యని మామిడి పండు అని అర్థం. అదే కాండం చివర పుల్లని వాసన, ఆల్కహాల్ వాసన వస్తే కనుక అది పాడైన పండు అని అర్థం. సహజంగా పండిన మామిడి పండ్ల వాసన, కాల్షియం కార్బైడ్ వాడిన మామిడి పండ్ల వాసన వేరుగా ఉంటుంది. కాల్షియం కార్బైడ్ వాడిన పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. కాబట్టి ఈ తేడాలను బట్టి మంచి మామిడి పండ్లను, సహజంగా పండే మామిడి పండ్లను ఎంచుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.