Krishna Kowshik
సివిల్ సర్వీస్ కోసం సన్నద్దమౌతున్న పౌరులకు గుడ్ న్యూస్.. సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది యూపీఎస్సీ, వీటితో పాటు ఇండియన్ ఫారెస్టు సర్వీసులకు సంబంధించి విడిగా నోటిఫికేషన్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సివిల్ సర్వీస్ కోసం సన్నద్దమౌతున్న పౌరులకు గుడ్ న్యూస్.. సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది యూపీఎస్సీ, వీటితో పాటు ఇండియన్ ఫారెస్టు సర్వీసులకు సంబంధించి విడిగా నోటిఫికేషన్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Krishna Kowshik
సివిల్ సర్వీసెస్ సాధించాలనే ఆశావాహులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,056 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పరీక్షకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో 150 పోస్టులకు విడిగా నోటిఫికేషన్ ఇచ్చింది యూపీఎస్సీ. గతంలో విడుదల చేసిన క్యాలెండర్‌కు అనుగుణంగానే ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు నేటి నుండి మార్చి 5 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరించనుంది. మే 26న ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్ 19న మెయిన్స్ జరుగనున్నాయి.
నోటిఫికేషన్‌లో ముఖ్య అంశాలు..
విద్యార్హతలు: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత అయ్యి ఉండాలి.
వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 21 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు ఉంది
దరఖాస్తు రుసుం: ఓబీసీ, ఇతర అభ్యర్థులకు రూ. 100 (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు)
ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు: విజయవాడ, విశాఖ పట్నం, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్, వరంగల్
మెయిన్స్ పరీక్షా కేంద్రాలు : విజయవాడ, హైదరాబాద్
ప్రిలిమినరీ పరీక్ష: ఇందులో అబెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కులు కూడా. ప్రిలిమ్స్ లో అర్హత సాధించి అభ్యర్థులు మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తారు
మెయిన్స్ పరీక్ష.. ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే.. ఇంటర్వ్యూ నిర్వహించి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక
ఎవరు ఎన్ని సార్లు రాయొచ్చు అంటే.
సాధారణ అభ్యర్థులు : 6 సార్లు..
ఓబీసీ : 9 సార్లు..
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు : పరిమితి లేదు