iDreamPost
android-app
ios-app

కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి.. నెలకు 1,77,500 వరకు జీతం.. త్వరపడండి

  • Published Apr 14, 2024 | 5:01 PM Updated Updated Apr 14, 2024 | 5:01 PM

భారీ వేతనంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనేది మీ కల. అయితే మీ కోసమే ఈ వార్త. త్వరపడండి..

భారీ వేతనంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనేది మీ కల. అయితే మీ కోసమే ఈ వార్త. త్వరపడండి..

  • Published Apr 14, 2024 | 5:01 PMUpdated Apr 14, 2024 | 5:01 PM
కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి.. నెలకు 1,77,500 వరకు జీతం.. త్వరపడండి

ప్రభుత్వ ఉద్యోగం అంటే మాటలు కాదు. అందునా ప్రారంభం నుంచే భారీ వేతనం లభించే జాబ్ అంటే.. ఇక పోటీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్లైతే.. మీకో భారీ శుభవార్త. నెలకు 1,77,500 జీతం పొందే ఉద్యోగంలో చేరవచ్చు. పోస్టులు కూడా భారీగానే ఉన్నాయి. అయితే పోటీ కూడా అదే స్థాయిలో ఉంటుంది అనుకోండి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి.. ఎలా ఎంపిక చేస్తారు, దరఖాస్తు తేదీలు, పరీక్ష ఫీజుకు సంబంధించిన వివరాలు మీకోసం..

దేశ రాజధాని న్యూడిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వందల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 827 మెడికల్ ఆఫీసర్/జీడీఎంవో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 ప్రకటనను విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాలి. ఈనెలాఖరు అనగా.. ఏప్రిల్‌ 30 ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఆఖరి రోజు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://upsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు మీ కోసం

  • కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024
  • మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ పోస్టులు: 163
  • అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వే) పోస్టులు : 450
  • జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌) పోస్టులు: 14
  • జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2(ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌): 200
  • ఎలిజబిలిటి: ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు యూపీఎస్సీ పేర్కొన్న శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • ఏజ్ లిమిట్: 1.8.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.
  • వేతనం: నెలకు రూ.56,100-1,77,500గా ఉంటుంది.
  • అప్లికేషన్ ఫీజు: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
  • సెలక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష (500 మార్కులు), ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ (100 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

  1. ఆన్‌లైన్‌ అప్లికేషన్ కు లాస్ట్ డేట్: ఏప్రిల్‌ 30, 2024
  2. దరఖాస్తుల సవరణకు చివరి తేదీ: మే 7, 2024
  3. పరీక్ష తేదీ: జులై 14, 2024