P Krishna
Good News for Bank Employees: గత కొంత కాలంగా బ్యాంక్ ఉద్యోగులు పలు డిమాండ్లపై పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే వారికి రెండు గుడ్ న్యూస్ లు ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.
Good News for Bank Employees: గత కొంత కాలంగా బ్యాంక్ ఉద్యోగులు పలు డిమాండ్లపై పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే వారికి రెండు గుడ్ న్యూస్ లు ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.
P Krishna
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కొన్ని సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు ఉన్నాయి. ఉద్యోగస్తులపై ఎక్కువగా పనిభారం పడకుండా సమర్ధవంతమైన పని రాబట్టుకునేందుకు ఐదు రోజుల పనిదినాల అమలు చేస్తున్నారు. తమకు కూడా వారంలో ఐదు రోజులు పనిదినాలు కల్పించాలని ఎప్పటి నుంచో బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తమకు జీతాలు కూడా పెంచాలని పలుమార్లు నిరసనలు, ధర్నాలు కూడా చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బ్యాంక్ ఉద్యోగులకు ఒకేసారి రెండు శుభవార్తలు వెలువడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రెండు శుభవార్తల ఏంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
బ్యాంకు రంగంలో కొనసాగుతున్న ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్న డిమాండ్లు నెరవేరబోతున్నాయి. వారంలో 5 రోజుల పని దినాలు త్వరోల అమలులోకి రానున్నాయి. అలాగే బ్యాంక్ ఉద్యోగుల వేతనాలు 17 శాతం పెరగనున్నాయి. ఈ మేరకు ఇండియన్ బ్యాంకుల సంఘం, బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తుంది. ప్రతి నెలలో అన్ని శనివారాలును సెలవు దినంగా గుర్తించడానికి ఉమ్మడి అంగీకారం కుదిరిందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలిపింది. 2022 నవంబర్ నుంచి బ్యాంకు ఉద్యోగుల వేతనలు పెరగనున్నాయి. దీని వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంవత్సరానికి అదనంగా రూ.8284 కోట్లు ఖర్చ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు లబ్ది పొందుతున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించాల్సి ఉంటుంది.. దాదాపు ఇది ఖరారైనట్లే అంటున్నారు అధికారులు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సి ఉంది. 8088 డీఏ పాయింట్లను కలిపిన తర్వాత ఉద్యోగస్తులకు కొత్త వేతన స్కేళ్లు రూపొందించనున్నారు. ప్రస్తుతం బ్యాంకులు వారానికి ఆరు రోజులు పనిచేస్తున్న విషయం తెలిసిందే. రెండో, నాలుగో శనివారం సహా ఆదివరాలు సెలవు ఉండగా.. ఈ నిర్ణయంతో నెలకు నాలుగు శనివారాలు సెలవు ఉండనుంది. ఈ వార్త విన్న బ్యాంక్ ఉద్యోగస్తులు సంతోషంలో మునిగిపోయారు.