Group 2 పరీక్షల షెడ్యూల్ విడుదల.. పరీక్ష తేదీలు ఇవే

Telangana Group 2: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. తాజాగా టీజీపీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించింది. గ్రూప్ 2 పరీక్షలు ఏయే తేదీల్లో జరుగనున్నాయంటే?

Telangana Group 2: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. తాజాగా టీజీపీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించింది. గ్రూప్ 2 పరీక్షలు ఏయే తేదీల్లో జరుగనున్నాయంటే?

తెలంగాణలోని గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. డిసెంబర్ 15,16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. వాస్తవానికి ఆగస్టు 7,8 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. పోటీ పరీక్షలు ఎక్కువగా ఉండడం, ప్రిపరేషన్ కు సమయం చాలడం లేదని గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసి తాజాగా దీనికి సంబంధించిన పరీక్షా తేదీలను ప్రకటించింది.

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022-డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదలచేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్ 2 పరీక్షలు గతేడాదే పూర్తి కావాల్సింది. కానీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. ఈ ఏడాది ఆగస్టు 7,8 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు మరోసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు నిరసనలు చేపట్టడంతో రేవంత్ సర్కార్ ఈ ఏడాది డిసెంబర్ కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. షెడ్యూల్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

గ్రూప్-2 పోస్టుల వివరాలు:

  • మొత్తం ఖాళీల సంఖ్య: 783
  • మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11
  • అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59
  • నాయబ్ తహసిల్దార్: 98
  • సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63
  • అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09
  • మండల్ పంచాయత్ ఆఫీసర్: 126
  • ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97
  • అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02
  • డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11
  • అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17
  • అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09
  • అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17
Show comments