iDreamPost

Free Coaching: సివిల్స్‌ అభ్యర్థులకు శుభవార్త.. ఫ్రీ కోచింగ్‌, వసతి.. డబ్బులు కూడా ఇస్తారు

  • Published Jun 23, 2024 | 5:06 PMUpdated Jun 23, 2024 | 5:06 PM

సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ఉచితంగా కోచింగ్‌, వసతి కల్పించడమే కాక.. డబ్బులు కూడా ఇ‍వ్వనున్నారు. ఆ వివరాలు..

సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ఉచితంగా కోచింగ్‌, వసతి కల్పించడమే కాక.. డబ్బులు కూడా ఇ‍వ్వనున్నారు. ఆ వివరాలు..

  • Published Jun 23, 2024 | 5:06 PMUpdated Jun 23, 2024 | 5:06 PM
Free Coaching: సివిల్స్‌ అభ్యర్థులకు శుభవార్త.. ఫ్రీ కోచింగ్‌, వసతి.. డబ్బులు కూడా ఇస్తారు

పోటీ పరీక్షల కోసం ప్రిపేర్‌ అయ్యే వారు అనుభవించే కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్థికంగా అంతో, ఇంతో డబ్బులున్న వారికి ఇలాంటి పరీక్షలకు ప్రిపేరవ్వడం అంత కష్టమైన కాదు. కానీ పేద, మధ్యతరగతి వారికి మాత్రం ఇలాంటి పోటీ ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వడం అన్నది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎంత లేదన్నా నెలకు 5-10 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అంత మొత్తాన్ని తల్లిదండ్రులు ఇంటి దగ్గర నుంచి పపండం చాలా కష్టమైన పని. ఈ క్రమంలో ప్రభుత్వాలు.. పోటీ ప్రవేశ పరీక్షల కోసం ప్రిపేర్‌ అయ్యే వారిని ఆదుకోవడం కోసం ముందుకు వస్తున్నాయి. వారికి ఉచితంగా కోచింగ్‌ ఇవ్వడమే కాక వసతి, భోజన సదుపాయం కల్పించడమే కాక.. ప్రతి నెలా స్టైఫండ్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

మనదేశంలో అత్యంత కఠినమైన పోటీ పరీక్ష ఏది అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌. సివిల్స్ క్లియర్ చేసినోళ్లు దేశవ్యాప్తంగా అడ్మినిస్ట్రేటివ్, పోలీస్ సర్వీసెస్‌లో ఉద్యోగాల్లో చేరతారు. అయితే సివిల్స్‌కు ప్రిపేర్‌ అవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దాంతో సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యే పేదవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్(టీఎస్‌బీసీఈఎస్‌డీటీసీ)ఆధ్వర్యంలో టీఎస్ బీసీ స్టడీ సర్కిల్.. సివిల్ సర్వీస్(ప్రిలిమ్స్,మెయిన్స్)పరీక్షకు సంబంధించి ఉచిత కోచింగ్ అందిస్తోంది. ఇందుకోసం అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు జులై 3వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేసి.. వారికి ఫ్రీ కోచింగ్ తో పాటు వసతి, భోజన ఖర్చుల కింద రూ.5000, బుక్‌ఫండ్‌ రూ.5000 అందజేస్తారు.

అర్హత

అభ్యర్థులు ఈ ప్రయోజనాన్ని పొందాలంటే.. కింది అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించకూడదు. అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించకూడదు.

సీట్లు

ఈ పథకం ద్వారా మొత్తం 150 మందికి ఉచితంగా కోచింగ్‌ అందజేస్తారు. ఈ 150 మందిలో బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం, ఇతరులకు 5 శాతం సీట్లను కేటాయించారు. ఇందులో 100 మందిని ఆన్‌లైన్ ఎగ్జామ్ ద్వారా ఎంపికచేస్తారు. మిగతా 50 సీట్లను సివిల్స్‌ ప్రీలిమ్స్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కేటాయిస్తారు.

కోచింగ్‌ ఎప్పటి వరకు ఉంటుందంటే

  • 18.07.2024 నుంచి 18-04-2025 వరకు.

ఎలా సెలక్ట్‌ చేస్తారంటే..

  • ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా

స్థలం

  • టీజీ బీసీ స్టడీ సర్కిల్, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-07-2024.
  • ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీ: 07-07-2024.
  • పరీక్ష ఫలితాల వెల్లడి: 10-07-2024.
  • క్లాస్ ల ప్రారంభం : 18-07-2024.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి