iDreamPost
android-app
ios-app

Tech Mahindra: డిగ్రీ పూర్తి చేశారా? టెక్‌ మహీంద్రాలో మీకోసం జాబ్ రెడీగా ఉంది!

  • Published Apr 26, 2024 | 3:28 PM Updated Updated Apr 26, 2024 | 3:28 PM

డిగ్రీ పూర్తి చేసి ఉండి.. టెక్‌ కంపెనీలో ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే మీ కోసమే ఈ వార్త. నిరుద్యోగులకు టెక్‌ మహీంద్రా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. భారీగా ఉద్యోగాలు భర్త చేస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..

డిగ్రీ పూర్తి చేసి ఉండి.. టెక్‌ కంపెనీలో ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే మీ కోసమే ఈ వార్త. నిరుద్యోగులకు టెక్‌ మహీంద్రా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. భారీగా ఉద్యోగాలు భర్త చేస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..

  • Published Apr 26, 2024 | 3:28 PMUpdated Apr 26, 2024 | 3:28 PM
Tech Mahindra: డిగ్రీ పూర్తి చేశారా? టెక్‌ మహీంద్రాలో మీకోసం జాబ్ రెడీగా ఉంది!

ప్రస్తుతం ఐటీ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం కోసం చాలా కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీల్లో అయితే ఎంప్లాయిస్‌ వారే బయటకు వెళ్లిపోతున్నారు. గూగుల్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అది కూడా భారీ సంఖ్యలో. మన దగ్గరనే కాక.. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. చాలా వరకు కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ఆపేశాయి. ఉన్న ఉద్యోగులనే తొలగించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. కానీ దిగ్గజ కంపెనీ మహీంద్రా మాత్రం ఇందుకు భిన్నమైన ప్రకటన చేసింది. డిగ్రీ పూర్తి చేసిన వారి కోసం భారీగా ఉద్యోగాలు కల్పించేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు.

మీరు డిగ్రీ పూర్తి చేశారా.. కంప్యూటర్‌ స్కిల్స్‌ ఉండి.. టెక్‌ కంపెనీలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే మీకోసమే టెక్‌ మహీంద్రా ఈ ప్రకటన చేసింది. ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రతి క్వార్టర్‌లో 1500 మంది చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 6000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సీఈవో మోహిత్‌ జోషి వివరాలు వెల్లడించారు. అలానే సుమారు 50 వేల మంది ఉద్యోగులకు ఏఐ రిలేటర్‌ ట్రైనింగ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. టెక్‌ మహీంద్రా ప్రకటనపై ఫ్రెషర్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక టెక్ మహీంద్రా గురువారం 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి ) ఫలితాల వెల్లడి సందర్భంగా ఈ ప్రకటన చేసింది. ఇక ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం సంవత్సరానికి 41 శాతం పడిపోయి 661 కోట్ల రూపాయలకు చేరుకుందని తెలిపింది. గత త్రైమాసికంలో రూ.1,117.70 కోట్ల లాభం వచ్చింది. ఇక మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టెక్ మహీంద్రా కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 795 తగ్గింది. అదే సమయంలో 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 6,945 తగ్గింది.

టెక్‌ మహీంద్ర ఉచిత ఉపాధి శిక్షణ

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ శుభవార్త చెప్పింది. వారికి 4 నెలల పాటు ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ సమన్వయకర్త శ్రీధర్‌ వెల్లడించారు. 18-27 వయస్సు కలిగి పదో తరగతి, ఇంటర్, డిగ్రీలో పాస్‌, ఫెయిల్‌ అయిన వారికి కంప్యూటర్‌ బేసిక్స్, ఎంఎస్‌ ఆఫీస్‌-2010, స్పోకెన్‌ ఇంగ్లిష్, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్స్, ఇంగ్లిష్‌ టైపింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్‌లో శిక్షణ ఇ‍స్తున్నారు. అలాగే.. బీకామ్‌ ఉత్తీర్ణులకు టాలీ ఈఆర్‌పీ 9, బేసిక్‌ అకౌంట్స్, అడ్వాన్స్‌డ్‌ ఎంఎస్‌-ఎక్సెల్‌ శిక్షణ ఇస్తున్నారు. అయితే ఏప్రిల్‌ 10 నాటికే దీని గడువు ముగిసింది.