iDreamPost
android-app
ios-app

Tech Mahindra: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. టెక్‌ మహీంద్రా హైదరాబాద్‌లో ఖాళీలు.. ఇలా అప్లై చేసుకొండి

  • Published Jun 21, 2024 | 4:16 PM Updated Updated Jun 21, 2024 | 4:16 PM

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అది కూడా హైదరాబాద్‌లో. అయితే మీ కోసమే ఈ వార్త. టెక్‌ మహింద్రా కంపెనీలో హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్‌ విడుదల చేసింది. ఆ వివరాలు..

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అది కూడా హైదరాబాద్‌లో. అయితే మీ కోసమే ఈ వార్త. టెక్‌ మహింద్రా కంపెనీలో హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్‌ విడుదల చేసింది. ఆ వివరాలు..

  • Published Jun 21, 2024 | 4:16 PMUpdated Jun 21, 2024 | 4:16 PM
Tech Mahindra: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. టెక్‌ మహీంద్రా హైదరాబాద్‌లో ఖాళీలు.. ఇలా అప్లై చేసుకొండి

నేటి కాలంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్‌.. వేరే ఏ ఇతర జాబులకు లేదు. దానిలో ఎన్ని కష్టాలున్నా సరే.. చాలా మంది యువత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలంటే పడి చస్తారు. కారణం వాటికి చెల్లించే వేతనం. సాధారణంగా ఏదైనా ఉద్యోగంలో చేరితో.. ప్రారంభంలో జీతం చాలా తక్కువగా ఉంటుంది. కానీ సాఫ్ట్‌వేర్‌ కొలువుకు అలా కాదు. ప్రారంభంలోనే లక్షల రూపాయల ప్యాకేజీ ఇచ్చి మరి ఉద్యోగంలో చేర్చుకుంటారు. ఒక్కసారి సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వస్తే చాలు లైఫ్‌ సెట్టు అనుకుంటారు చాలా మంది. అయితే ఈ మధ్య కాలంలో ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొని ఉంది. టాప్‌ ఎమ్‌ఎన్‌సీలు సహా చిన్న చిన్న కంపెనీలు కూడా భారీ ఎత్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దాంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

ఇక ప్రస్తుతం ఐటీ రంగంలో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించుకునే పనిలో ఉన్నాయి. కొత్తగా ఎవరిని రిక్రూట్‌ చేసుకోవడం లేదు. గతంలో చేసుకున్నా.. వారిని వెంటనే జాయిన్‌ చేసుకోవడం లేదు. దాంతో ఉద్యోగం వచ్చినా సరే.. జాయినింగ్‌ ఎప్పుడు ఉంటుందో తెలియక అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మాత్రం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అది కూడా హైదరాబాద్‌లోనే. ఇంతకు ఆ కంపెనీ ఏది అంటే.. టెక్‌ మహీంద్రా హైదరాబాద్‌. ఆ వివరాలు..

ప్రముఖ దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అసోసియేట్‌ టెక్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు.. ఆన్‌లైన్‌ విధానంలో.. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు.. అప్లై చేసుకోవడానికి లింక్‌ ఇక్కడ ఇస్తున్నాం. దీని మీద క్లిక్‌ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్ట్‌ 31 చివరి తేది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం..

  • జాబ్‌- అసోసియేట్‌ టెక్‌ స్పెషలిస్ట్‌
  • అర్హత- డిగ్రీ పాస్‌ అయ్యి ఉండాలి. సంబంధిత విభాగంలో 5 నుంచి 10 ఏళ్ల పని అనుభవం. ఎస్‌ఏపీ ఎస్‌/ 4హెచ్‌ఏఎన్‌ఏ, సెంట్రల్‌ ఫైనాన్స్‌-2 పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్‌ కలిగి ఉండాలి.
  • జాబ్‌ లోకేషన్‌- హైదరాబాద్‌ కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు విధానం- ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
  • చివరి తేదీ- ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఆగస్ట్‌ 31, 2024

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler