Arjun Suravaram
TCS: ఎక్కువ మంది యువత ఐటీ జాబ్స్ కోసం గట్టిగా ట్రై చేస్తుంటారు. అలా ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న యువతకు ఓ గుడ్ న్యూస్ అందింది. అది కూడా ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైనా టీసీఎస్ సంస్థ శుభవార్త చెప్పింది.
TCS: ఎక్కువ మంది యువత ఐటీ జాబ్స్ కోసం గట్టిగా ట్రై చేస్తుంటారు. అలా ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న యువతకు ఓ గుడ్ న్యూస్ అందింది. అది కూడా ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైనా టీసీఎస్ సంస్థ శుభవార్త చెప్పింది.
Arjun Suravaram
నేటికాలంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. అందుకే ఎక్కువ మంది యువత ఐటీ జాబ్స్ కోసం గట్టిగా ట్రై చేస్తుంటారు. అలా ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న యువతకు ఓ గుడ్ న్యూస్ అందింది. అది కూడా ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైనా టీసీఎస్ సంస్థ శుభవార్త చెప్పింది. త్వరలో భారీ సంఖ్యలో ప్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే టీసీఎస్ సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ (టీసీఎస్)… ఈ పేరు తెలియని ఐటీ పీపుల్స్ ఉండరు. చాలా మందికి ఇందులో జాబ్ కొట్టాలని లక్ష్యంగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే..టీసీఎస్ తరచూ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదే సమయంలో తాజాగా నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. 2024లో 40 వేల మంది ఫ్రెషర్స్ ను తీసుకోవాలని టీసీఎస్ యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఇందు కోసం రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహించాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలిపింది.
ఇటీవల కాలంలో ఐటీ రంగం అభివృద్ధి పథంలో పయనిస్తున్న చాలా దేశాల్లో ఐటీ జాబ్స్ రిక్రూట్ సంబంధించి పెను మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా ప్రముఖ ఐటీ కంపెనీలు చాలా మంది ఉద్యోగులను తొలగించాయి. ఆ తరువాత ఇటీవల కాలంలో లే ఆఫ్స్ తగ్గి రిక్రూట్ మెంట్స్ పెరిగాయి. దీంతో.. టీసీఎస్ కంపెనీ కూడా ఉద్యోగ నియామకాలను స్పీడ్ చేసింది. ఒక్క జూన్ త్రైమాసికంలోనే ఈ సంస్థ కొత్తగా 5,452 మందికి ఉద్యోగాలు కల్పించింది. దీంతో.. ప్రస్తుతం టీసీఎస్ సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయిస్ సంఖ్య 6,06,998కి చేరింది.
ఇక ఉద్యోగాల నియామకాల గురించి అలా ఉంటే.. వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి చెప్పేలా అడుగులు ముందుకు వేస్తుంది. వర్క్ ఫ్రం హోం చేసే వాళ్లు ఆఫీస్ కి రావాలని తెలిపింది. ఇప్పటికే 70 శాతం మంది ఉద్యోగులను ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ విధానంలో టీసీఎస్ సక్సెస్ అయింది. ఆఫీస్ కు వెళ్లి పనిచేసే ఉద్యోగులు కోరుకుంటే త్రైమాసిక బోనస్ లు కూడా ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు ఇళ్లు వదలి.. ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు 4.5 నుంచి 7 శాతం జీతం పెంపుదలను అమలు చేస్తున్నామని తెలిపింది.
అలానే వర్క్ లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు 10 నుంచి 12 శాతం ఇంక్రిమెంట్ కూడా ఇచ్చినట్లు టీసీఎస్ పేర్కొంది. టీసీఎస్ ఇటీవలే వేరియబుల్ పే పాలసీలో మార్పులు చేసింది. ఆఫీస్ లో హాజరవ్వడాన్నే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ఉద్యోగులకు స్పష్టం చేసింది. దీంతో.. ఎక్కువ మంది టీసీఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి.. ఉద్యోగం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా టీసీఎస్.. కొత్తగా ఐటీ ఉద్యోగంలో చేరాలనుకునే వారికి శుభవార్తను అందించింది.