iDreamPost
android-app
ios-app

మీరు హిందీలో ఎక్స్‌పర్టా.. అయితే నెలకు లక్షకు పైగా వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

  • Published Aug 06, 2024 | 6:59 PM Updated Updated Aug 06, 2024 | 6:59 PM

SSC-Hindi Translators Examination 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. హిందీ మీద మీకు మంచి పట్టుందా.. అయితే ఇది మీ కోసమే..

SSC-Hindi Translators Examination 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. హిందీ మీద మీకు మంచి పట్టుందా.. అయితే ఇది మీ కోసమే..

  • Published Aug 06, 2024 | 6:59 PMUpdated Aug 06, 2024 | 6:59 PM
మీరు హిందీలో ఎక్స్‌పర్టా.. అయితే నెలకు లక్షకు పైగా వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. మీకు హిందీ, ఇంగ్లీష్‌ భాషల మీద బాగా పట్టుందా.. అయితే కేంద్ర ప్రభుత్వం మీకొక బంపరాఫర్‌ కల్పిస్తోంది. నెలకు లక్ష రూపాయలకు పైగా వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్‌ ఇచ్చింది. మీరు కనక ఇలాంటి ఉద్యోగం కోసమే ఎదురు చూస్తున్నట్లయితే.. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కేంద్ర ప్రభుత్వం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంతకు ఇవి ఏ ఉద్యోగాలు.. వీటికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి వంటి పూర్తి వివరాలు మీకోసం..

కేంద్ర ప్రభుత్వం.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, సీనియర్ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 312 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఏ పోస్టులంటే..

  • జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌
  • జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్
  • జూనియర్ ట్రాన్స్‌లేటర్‌
  • సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌
  • సీనియర్ ట్రాన్స్‌లేటర్‌

అర్హత:

పోస్టును అనుసరించి.. మాస్టర్‌ డిగ్రీ ఈ(హిందీ, ఇంగ్లీష్‌), డిగ్రీ స్థాయిలో హిందీ, ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌గా ఉండాలి. దీనితో పాటు ట్రాన్స్‌లేషన్‌ (హిందీ, ఇంగ్లీష్‌) డిప్లోమా లేదంటే సర్టిఫికేట్‌ కోర్సు చేసి ఉండాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలో రెండేళ్లు ట్రాన్స్‌లేటర్‌గా పని చేసిన అనుభవం ఉండాలి. అలానే సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీతోపాటు మూడేళ్ల ట్రాన్స్‌లేషన్‌ అనుభవం ఉండాలి. బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ(హిందీ, ఇంగ్లీష్‌) అర్హతతో పాటు తగు అనుభవం ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర స్రభుత్వ విద్యా సంస్థల్లో సీనియర్‌ సెకండరీ స్థాయిలో రెండేళ్ల పాటు హిందీ బోధనలో అనుభవం ఉండాలి.

ఏజ్‌ లిమిట్‌:

30 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సామాజిక వర్గాల వారీగా సడలింపులు ఉంటాయి.

జీతం:

  • సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, సీనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు రూ.44,900-1,42,400 వరకు వేతనంగా ఇస్తారు.
  • జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌కు రూ35,400-1,12,400 వరకు జీతం ఇస్తారు.
  • జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌కు రూ. 35,400- 1,12,400,
  • జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌కు రూ. 35,400-1,12,400 వేతనంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం:

రాతపరీక్ష (పేపర్‌-1, పేపర్‌-2). తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.

చివరి తేది: ఆగస్టు 25

పరీక్ష తేదీలు: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-1): అక్టోబర్/ నవంబర్‌, 2024.

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌: https://ssc.nic.in/