Dharani
ఎస్‌బీఐలో ఉద్యోగం పొందాలనుకుంటున్నారా.. అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. నెలకు 70 వేల జీతం పొందాలని భావిస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే.
ఎస్‌బీఐలో ఉద్యోగం పొందాలనుకుంటున్నారా.. అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. నెలకు 70 వేల జీతం పొందాలని భావిస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే.
Dharani
నేటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారిలో ఎక్కువ మంది లక్ష్యం బ్యాంక్ జాబ్స్. అందునా.. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెద్దదైనా భారతీయ స్టేట్ బ్యాంక్‌లో జాబ్ కోసం ప్రయత్నించే వారు ఎక్కువగా ఉంటారు. ఇక మీరు కూడా ఇలానే బ్యాంక్ జాబ్.. అందునా.. ఎస్‌బీఐలో జాబ్ కొట్టాలని భావిస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. ఈ ఛాన్స్ గనక మిస్ చేసుకుంటే.. మీరు చాలా చాలా బాధపడతారు. తాజాగా ఎస్‌బీఐ కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పాసైతే చాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కనుక ఎస్‌బీఐలో జాబ్ కోసం కలలు కనే వారు.. ఈ ఛాన్స్‌ను అస్సలు మిస్ చేసుకోకూడదు అంటున్నారు నిపుణులు ఆ వివరాలు..
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ కింద ఉన్న పలు బ్రాంచుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-II)- మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్-స్కేల్ II కింద ఈ 150 పోస్టులను భర్తీ చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ఈ పోస్టులకు అభ్యర్థులను సెలక్ట్ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలు పొందాలనుకునే వారు.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో కనీసం రెండేళ్లు పని చేసిన అనుభవం ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని భావించే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా డిసెంబర్ 31, 2023 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎస్‌ఓ పోస్టులకు ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని భావించే వారికి చివరి తేదీ జూన్ 27, 2024. ఇక దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.750 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని భావించే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ దరఖాస్తు, రుసుం చెల్లింపులు రెండూ జూన్ 07, 2024వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఉద్యోగం పొందిన వారు హైదరాబాద్, కోల్‌కతాలలో పని చేయవల్సి ఉంటుంది. ఈ ఉద్యోగులకు నెలకు రూ.48,170 నుంచి రూ.69,810వరకు జీతంగా చెల్లిస్తారు. మరి ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోవాలి.