SBI SCO Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో ఉద్యోగాలు.. 60 లక్షల జీతం!

SBI SCO Recruitment 2024 Notification, Qualifications, Salary Details: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ, డిప్లోమా, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టుల కింద 10 కేటగిరీలకు చెందిన పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది.

SBI SCO Recruitment 2024 Notification, Qualifications, Salary Details: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ, డిప్లోమా, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టుల కింద 10 కేటగిరీలకు చెందిన పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది.

మీరు డిగ్రీ అర్హత కలిగి ఉన్నారా? అయితే ఇదే మంచి అవకాశం. డిగ్రీ అర్హతతో పలు పోస్టులను భర్తీ చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గాను మొత్తం 1040 స్పెషలిస్టు ఆఫీసర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. రిలేషన్ షిప్ మేనేజర్, వీపీ హెల్త్, రిలేషన్ షిప్ మేనేజర్ టీమ్ లీడ్, రీజనల్ హెడ్, ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రాడెక్ట్ లీడ్), సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్), ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (టెక్నాలజీ), ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (బిజినెస్) ఇలా మొత్తం 10 కేటగిరీల్లో 1040 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 833 రెగ్యులర్ పోస్టులు కాగా.. 207 బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంబీఏ అర్హులైన అభ్యర్థులను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎస్బీఐ కోరింది. బయోడేటా ఫార్మాట్, సీటీసీ నెగోషియేషన్ ఫార్మాట్, ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ ఫార్మాట్ లను ఎస్బీఐ తన వెబ్ సైట్ లో ఉంచింది. ఆ ఫార్మాట్లను ఫిల్ చేసి దరఖాస్తుతో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత విభాగాల్లో అనుభవం కలిగి ఉండాలి.          

పోస్టుకి తగ్గట్టు ఏడాదికి జీతాలు: 

  • సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రాడెక్ట్ లీడ్): 61 లక్షలు 
  • సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్): 20.50 లక్షలు 
  • ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (టెక్నాలజీ): 30 లక్షలు 
  • ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (బిజినెస్): 30 లక్షలు 
  • రిలేషన్ షిప్ మేనేజర్: 30 లక్షలు 
  • వీపీ హెల్త్: 45 లక్షలు 
  • రిలేషన్ షిప్ మేనేజర్(టీమ్ లీడ్): 52 లక్షలు 
  • రీజనల్ హెడ్: 66.50 లక్షలు 
  • ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్: 44 లక్షలు 
  • ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్: 26.50 లక్షలు 

అర్హతలు:

  • సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రాడెక్ట్ లీడ్): ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం 
  • సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్): కామర్స్/ఫైనాన్స్/ఎకనామిక్స్/మేనేజ్మెంట్/మ్యాథ్ మెటిక్స్/స్టాటిస్టిక్స్ లో గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్
  • ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్(టెక్నాలజీ): ఎంబీఏ/ఎంఎంఎస్/పీజీడీఎం/ఎంఈ/ఎం.టెక్/బీఈ/బీ.టెక్/పీజీడీబీఎం
  • ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్( బిజినెస్): ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం 
  • రిలేషన్ షిప్ మేనేజర్: గ్రాడ్యుయేట్ 
  • వీపీ హెల్త్: గ్రాడ్యుయేట్ 
  • రిలేషన్ షిప్ మేనేజర్(టీమ్ లీడ్): గ్రాడ్యుయేట్ 
  • రీజనల్ హెడ్: గ్రాడ్యుయేట్ 
  • ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్: ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం 
  • ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్: ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం 

వయసు పరిమితి: విభాగాన్ని బట్టి 26 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా 

దరఖాస్తు ఫీజు: 

  • ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు: ఫీజు లేదు 
  • మిగతా అభ్యర్థులకు: రూ. 750

దరఖాస్తు వివరాలు:

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 19/07/2024
  • అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ: 08/08/2024
  • ఫీజు చెల్లింపు తేదీ: 19/07/2024 నుంచి 08/08/2024 వరకూ
  • ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ: 08/08/2024
  • దరఖాస్తు సవరణకు ఆఖరు తేదీ: 08/08/2024
  • దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి ఆఖరు తేదీ: 31/10/2024

 

Show comments