iDreamPost
android-app
ios-app

లైఫ్ లో ఈ ఛాన్స్ మళ్లీ రాదు.. రైల్వేలో 7,934 జాబ్స్.. అర్హులు వీరే?

  • Published Jul 22, 2024 | 8:42 PM Updated Updated Jul 22, 2024 | 8:42 PM

RRB Recruitment 2024: రైల్వేలో జాబ్స్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏకంగా 7934 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. లైఫ్ లో మళ్లీ రాని ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.

RRB Recruitment 2024: రైల్వేలో జాబ్స్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏకంగా 7934 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. లైఫ్ లో మళ్లీ రాని ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.

  • Published Jul 22, 2024 | 8:42 PMUpdated Jul 22, 2024 | 8:42 PM
లైఫ్ లో ఈ ఛాన్స్ మళ్లీ రాదు.. రైల్వేలో 7,934 జాబ్స్.. అర్హులు వీరే?

భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరవేస్తున్నది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ట్రైన్ జర్నీకే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు రైల్వే డిపార్ట్ మెంట్ అవరమైన సిబ్బందిని ఎప్పటికప్పుడు నియమిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. వెయ్యి కాదు రెండు వేలు కాదు ఏకంగా 7,934 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రైల్వేలో ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న వారికి లైఫ్ లో మళ్లీ రాని అవకాశమిది.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు భారీ సంఖ్యలో జూనియర్‌ ఇంజినీర్‌ రిక్రూట్‌మెంట్ 2024 షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 7,934 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్‌ లేదా బీఈ డిగ్రీ లేదా డిప్లొమా ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జులై 30 నుంచి ప్రారంభంకానుంది. కెమికల్ సూపర్ వైజర్ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 44900 జీతం, జూనియర్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 35400 చెల్లిస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 7934

అర్హత:

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్‌ లేదా బీఈ డిగ్రీ లేదా డిప్లొమా ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ. 500.ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మహిళా, ట్రాన్స్‌జెండర్లకు రూ. 250 గా నిర్ణయించారు.

ఎంపిక విధానం:

  • సీబీటీ స్టేజ్‌ 1, స్టేజ్‌ 2, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 30-07-2024

దరఖాస్తుకు చివరీ తేదీ:

  • 29-08-2024

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom