P Venkatesh
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నది. అర్హత, ఆసక్తి ఉన్న వారు నవంబర్ 27 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నది. అర్హత, ఆసక్తి ఉన్న వారు నవంబర్ 27 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
P Venkatesh
ఉద్యోగం ప్రతిఒక్కరి కల. ఉన్నతంగా చదువుకుని ఉన్నతమైన ఉద్యోగాలను సాధించాలని యువత కలలుకంటుంటారు. కలలు కనడమే కాదు వాటిని నిజం చేసుకోవడానికి రేయింభవళ్లు శ్రమిస్తుంటారు. ఎన్ని అడ్డంకులు ఎదురైన తమ లక్ష్యం వైపు సాగుతుంటారు. ఈ క్రమంలో కొందరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం సాధించి సెటిలైపోతారు. మరికొందరు మాత్రం ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? మీరు బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? బ్యాంక్ ఉద్యోగమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు పండగ లాంటి వార్త. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ/మేనేజ్‌మెంట్ (సెక్యూరిటీ) పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 42 పోస్టులను భర్తీ చేయనున్నది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలను పొందే అవకాశం కల్పించింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 27 వరకు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని కోరింది.
ముఖ్యమైన సమాచారం
మొత్తం పోస్టులు
42 డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) / మేనేజ్‌మెంట్ (సెక్యూరిటీ)
అర్హత
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థుల కనీస వయస్సు 25 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.750.. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ
ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరఖాస్తు ప్రారంభ తేదీ
నవంబర్ 07 2023
దరఖాస్తులకు చివరి తేదీ
నవంబర్ 27 2023
దరఖాస్తు విధానం
ఆన్ లైన్
అధికారిక వెబ్ సైట్