P Venkatesh
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తాజాగా నార్త్ రైల్వే విభాగంలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తాజాగా నార్త్ రైల్వే విభాగంలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
P Venkatesh
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఇండియన్ రైల్వేస్ గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. ఎంచక్కా టెన్త్, ఐటీఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నా మీ కలను నిజం చేసుకోవచ్చు. తాజాగా నార్త్ రైల్వే విభాగంలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నార్త్ రైల్వేలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు భర్తీ ప్రక్రియను చేపట్టింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 3093 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది.
భారతీయ రైల్వే నుంచి తరచుగా నోటిఫికేషన్స్ విడుదల అవుతూనే ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగింది మన భారతీయ రైల్వే. కాబట్టి డిమాండ్ కు తగ్గట్లు సిబ్బంది కొరత లేకుండా ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నార్త్ రైల్వే విభాగం 3093 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కాగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియ డిసెంబర్ 11 2023 నుంచి ప్రారంభం కానుంది. అప్లికేషన్ ప్రక్రియ జనవరి 01 2024 న క్లోజ్ అవుతుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు నార్త్ రైల్వే అధికారికి వెబ్ సైట్ https://rrcnr.org/ ను పరిశీలించాలని కోరింది.