iDreamPost
android-app
ios-app

అప్లై చేశారా? డిగ్రీ పాసైతే చాలు.. 17,727 జాబ్స్ రెడీ.. రేపే లాస్ట్ డేట్

SSC CGL Application 2024: మీరు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. 17727 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనున్నది. వెంటనే అప్లై చేసుకోండి.

SSC CGL Application 2024: మీరు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. 17727 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనున్నది. వెంటనే అప్లై చేసుకోండి.

అప్లై చేశారా? డిగ్రీ పాసైతే చాలు.. 17,727 జాబ్స్ రెడీ.. రేపే లాస్ట్ డేట్

ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఏకంగా 17,727 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలోనే దరఖాస్తు గడువు ముగియనున్నది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమైతే వెంటనే అప్లై చేసుకోండి. ఇటీవల స్థాఫ్ సెలక్షన్ కమిషన్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024 ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు.

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకునే ఛాన్స్. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న వారు జులై 24 వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంకా ఒక్కరోజు మాత్రమే అప్లై చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. పోస్టులను అనుసరించి డిగ్రీ, సీఏ, ఎంబీఏ అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు 18-45 ఏళ్ల వయసును కలిగి ఉండాలి. ఆయా పోస్టులను బట్టి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది. ఇతర భత్యాలు అదనం. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య:

  • 17,727

పోస్టుల వివరాలు:

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
  • అసిస్టెంట్
  • ఇన్‌స్పెక్టర్ – (సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్)
  • ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
  • ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
  • అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
  • సబ్ ఇన్‌స్పెక్టర్ (సీబీఐ)
  • ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)
  • ఇన్‌స్పెక్టర్ – ఇన్‌కమ్ ట్యాక్స్
  • అసిస్టెంట్/అసిస్టెంట్ సూపరింటెండెంట్
  • ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)
  • ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (సీబీఐసీ)
  • రిసెర్చ్ అసిస్టెంట్ (ఎన్ హెచ్ఆర్సీ)
  • డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)
  • సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎన్ఐఏ)
  • సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌సీబీ)
  • జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)
  • స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ (హాంఅఫైర్స్)
  • ఆడిటర్ (కాగ్, సీజీడీఏ)
  • అకౌంటెంట్ (కాగ్, సీజీఏ)
  • సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
  • జూనియర్ అకౌంటెంట్ (సీజీసీఏ)
  • పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)
  • సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
  • అప్పర్ డివిజన్ క్లర్క్
  • ట్యాక్స్ అసిస్టెంట్

అర్హత:

  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆడిట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ స్టడీస్)/ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత ఉండాలి.

వయోపరిమితి:

  • 01.08.2024 నాటికి కొన్ని పోస్టులను అనుసరించి 18-32 సంవత్సరాలు కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • టైర్-1, టైర్-2 రాతపరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.

జీతం:

  • ఆయా పోస్టులను బట్టి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది. ఇతర భత్యాలు అదనం.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 24-06-2024

దరఖాస్తుకు చివరితేది:

  • 24-07-2024