SBI SCO Recruitment 2024: SBIలో 1040 జాబ్స్.. ఏడాదికి 45 లక్షల జీతం.. రేపు ఒక్కరోజే ఛాన్స్

SBI SCO Recruitment 2024: మీరు బ్యాంక్ జాబ్స్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారా? ఎస్బీఐ 1040 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

SBI SCO Recruitment 2024: మీరు బ్యాంక్ జాబ్స్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారా? ఎస్బీఐ 1040 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను అనుసరించి ఏడాదికి 45 లక్షల జీతం అందుకోవచ్చు. బ్యాంక్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్న వారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1040పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంతకీ అర్హులు ఎవరంటే?

ఎస్బీఐ భర్తీ చేయనున్న పోస్టుల్లో రిలేషన్ షిప్ మేనేజర్, వీపీ హెల్త్, రిలేషన్ షిప్ మేనేజర్ టీమ్ లీడ్, రీజనల్ హెడ్, ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రాడెక్ట్ లీడ్), సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్), ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (టెక్నాలజీ), ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (బిజినెస్) ఇలా మొత్తం 10 కేటగిరీల్లో 1040 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ, ఎంబీ, బీటెక్ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ లో ఆగస్టు 8 వరకు అప్లై చేసుకోవచ్చు. రేపు ఒక్కరోజే ఛాన్స్ ఉంది. అభ్యర్థుల వయసు 26 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల వివరాలు:

  • వీపీ సంపద : 643
  • రిలేషన్షిప్ మేనేజర్: 273
  • క్లరికల్ (క్రీడాకారుడు): 51
  • ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్: 39
  • రిలేషన్షిప్ మేనేజర్ – టీమ్ లీడ్ : 32
  • ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్: 30
  • అధికారులు (క్రీడాకారుడు): 17
  • రీజినల్ హెడ్: 6
  • సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్): 2
  • సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్): 2
  • ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (బిజినెస్): 2
  • ఆర్థికవేత్త: 2
  • డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ – ఆర్మీ: 1
  • ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (టెక్నాలజీ): 1

అర్హతలు:

  • సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రాడెక్ట్ లీడ్): ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం
  • సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్): కామర్స్/ఫైనాన్స్/ఎకనామిక్స్/మేనేజ్మెంట్/మ్యాథ్ మెటిక్స్/స్టాటిస్టిక్స్ లో గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్
  • ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్(టెక్నాలజీ): ఎంబీఏ/ఎంఎంఎస్/పీజీడీఎం/ఎంఈ/ఎం.టెక్/బీఈ/బీ.టెక్/పీజీడీబీఎం
  • ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్( బిజినెస్): ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం
  • రిలేషన్ షిప్ మేనేజర్: గ్రాడ్యుయేట్
  • వీపీ హెల్త్: గ్రాడ్యుయేట్
  • రిలేషన్ షిప్ మేనేజర్(టీమ్ లీడ్): గ్రాడ్యుయేట్
  • రీజనల్ హెడ్: గ్రాడ్యుయేట్
  • ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్: ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం
  • ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్: ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం

వయో పరిమితి:

  • విభాగాన్ని బట్టి 26 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రాడెక్ట్ లీడ్): 61 లక్షలు
  • సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్): 20.50 లక్షలు
  • ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (టెక్నాలజీ): 30 లక్షలు
  • ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (బిజినెస్): 30 లక్షలు
  • రిలేషన్ షిప్ మేనేజర్: 30 లక్షలు
  • వీపీ హెల్త్: 45 లక్షలు
  • రిలేషన్ షిప్ మేనేజర్(టీమ్ లీడ్): 52 లక్షలు
  • రీజనల్ హెడ్: 66.50 లక్షలు
  • ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్: 44 లక్షలు
  • ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్: 26.50 లక్షలు

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు. మిగతా అభ్యర్థులు రూ. 750 చెల్లించాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 19-07-2024

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ:

  • 08-08-2024
Show comments