iDreamPost
android-app
ios-app

ఈ అర్హతలున్నాయా? లక్షకుపైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు రెడీ

SAIL MT Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

SAIL MT Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

ఈ అర్హతలున్నాయా? లక్షకుపైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు రెడీ

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఇటీవల భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మంచి జీతాలతో కూడిన ఈ ఉద్యోగాలను సాధిస్తే లైఫ్ లో ఉన్నత స్థాయిలో స్థిరపడిపోవచ్చు. మరి మీరు కూడా గవర్నమెంట్ కొలువే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ ఉద్యోగాలను అస్సలు వదలకండి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది వెంటనే అప్లై చేసుకోండి.

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 249 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంజినీరింగ్ డిగ్రీలో పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లకు మించకూడదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.60,000 – రూ.1,80,000 అందిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల సంఖ్య: 249

విభాగాల వారీగా ఖాళీలు:

కెమికల్ ఇంజినీరింగ్: 10 పోస్టులు

సివిల్ ఇంజినీరింగ్: 21 పోస్టులు

కంప్యూటర్ ఇంజినీరింగ్: 09 పోస్టులు

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 61 పోస్టులు

ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 05 పోస్టులు

ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 11 పోస్టులు

మెకానికల్ ఇంజినీరింగ్: 69 పోస్టులు

మెటలర్జికల్ ఇంజినీరింగ్: 63 పోస్టులు

అర్హత:

  • అభ్యర్థులు కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2024 స్కోరు సాధించి ఉండాలి.

వయోపరిమితి:

  • 25.07.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు:

  • రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.

ఎంపిక విధానం:

  • గేట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.60,000 – రూ.1,80,000 అందిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం:

  • 05-07-2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:

  • 25-07-2024

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis