iDreamPost
android-app
ios-app

AP DMEలో 997 సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ ఉద్యోగాలు.. నెలకు 70 వేల జీతం

DME AP Senior Resident Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. నెలకు 70 వేల జీతంతో గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది.

DME AP Senior Resident Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. నెలకు 70 వేల జీతంతో గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది.

AP DMEలో 997 సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ ఉద్యోగాలు.. నెలకు 70 వేల జీతం

ఈ రోజుల్లో గవర్నమెంట్ కొలువు కొట్టాలంటే కష్టతరమైపోతున్నది. ఏ చిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే లక్షలాది మంది పోటీపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ క్రమంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నట్లైతే ఈ అవకాశాన్ని వదులుకోకండి. నెలకు 70 వేల జీతంతో గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు పోటీ కూడా తక్కువ. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులు ఎవరు? వయోపరిమితి ఎంత? ఆ వివరాలు మీకోసం..

ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కాలేజీల్లోని వివిధ విభాగాల్లో మొత్తం 997 సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 44 ఏళ్లు మించకూడదు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 27 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పోస్టు గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య: 997.

  • సీనియర్ రెసిడెంట్ (క్లినికల్) పోస్టులు: 425
  • సీనియర్ రెసిడెంట్ (నాన్ క్లినికల్) పోస్టులు: 479
  • సూపర్ స్పెషాలిటీ పోస్టులు: 93

అర్హత:

  • మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎండీఎస్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 44 ఏళ్లు మించకూడదు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.70,000 అందుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ:

  • పోస్టు గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • ఓసీ అభ్యర్థులు రూ.1000.. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్‌

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:

  • 27-08-2024