లైఫ్ సెట్ అయ్యే Jobs.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో 1,930 ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి!

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే మీకు ఇదే మంచి ఛాన్స్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో 1930 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే మీకు ఇదే మంచి ఛాన్స్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో 1930 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. కేవలం రూ. 25 ఫీజు చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) కేంద్రాల్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1,930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా (జనరల్ నర్సింగ్ మిడ్-వైఫరీ) ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను https://upsc.gov.in/ పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు

  • 1930.

అర్హతలు:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్‌(ఆనర్స్). బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. డిప్లొమా (జనరల్ నర్సింగ్ మిడ్-వైఫరీ). స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సు లేదా నర్సు, మిడ్‌వైఫ్‌గా సభ్యత్వం కలిగి ఉండాలి. దీంతో పాటుగా ఏదైనా 50 పడకల ఆసుపత్రిలో కనీసం ఏడాది కాలం పనిచేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • 27.03.2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు 33 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీలకు 35 సంవత్సరాలు, దివ్యాంగులకు 40 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.25 ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 07-03-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 27-03-2024.

పరీక్ష తేది:

  • 07-07-2024.
Show comments