iDreamPost

ఇది కదా జాబ్ అంటే.. నెలకు 1.2 లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అర్హులు వీరే

Hindustan Copper Limited Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కళ్లు చెదిరే జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

Hindustan Copper Limited Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కళ్లు చెదిరే జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

ఇది కదా జాబ్ అంటే.. నెలకు 1.2 లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అర్హులు వీరే

ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఉద్యోగార్థులకు ఇదే మంచి అవకాశం. వేలు, లక్షల రూపాయాల జీతాలుండే ఈ ఉద్యోగాలను సాధించి లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ కు విపరీతమైన కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో కాస్త కష్టపడి చదివితే చాలు ప్రభుత్వ కొలువును మీ సొంతం చేసుకోవచ్చు. మరి మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం సన్నద్ధమవుతున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి జూనియర్ మేనేజర్ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి కోల్ కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో జూనియర్ మేనేజర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 56 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యయేషన్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులు 40ఏళ్ల వయసు కలిగి ఉండాలి. రాత పరీక్ష, దృవపత్రాల ఆదారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 30,000-1,20000 అందిస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు జులై 21 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

జూనియర్ మేనేజర్ పోస్టుల సంఖ్య: 56

విభాగాలు:

  • మైనింగ్, ఎలక్ట్రికల్, కంపెనీ సెక్టటరీ, ఫైనాన్స్, హెచ్ ఆర్.

అర్హత:

  • పోస్టును అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యయేషన్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 40 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష, దృవపత్రాల ఆదారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 30,000-1,20000 అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • రూ. 500 చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ:

  • 01-07-2024

దరఖాస్తు ముగింపు తేదీ:

  • 21-07-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి