iDreamPost
android-app
ios-app

టెన్త్, ఇంటర్ అర్హతతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో Jobs.. నెలకు రూ. 81 వేల జీతం!

మీరు టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. వెంటనే అప్లై చేసుకోండి.

టెన్త్, ఇంటర్ అర్హతతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో Jobs.. నెలకు రూ. 81 వేల జీతం!

ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రంలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. టెన్త్, ఇంటర్ అర్హతలతో మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రూప్-సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 198 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ గత నెల 27న ప్రారంభంకాగా ఫిబ్రవరి 16తో ముగియనున్నది. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఎన్డీఏ అధికారిక వెబ్ సైట్ ను nda.nic.in పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 198

విభాగాల వారీగా ఖాళీలు:

  • లోయర్ డివిజన్ క్లర్క్-16 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్-2, సినిమా ప్రొజెక్షనిస్ట్ II-1, కుక్-14 పోస్టులు భర్తీ కానున్నాయి. కంపోజిటర్ కమ్ ప్రింటర్- 1, సివిల్ మోటార్ డ్రైవర్ (OG)-3, కార్పెంటర్-2, ఫైర్‌మెన్-2, టీఏ బేకర్ అండ్ కన్ఫెక్షనర్-1, టీఏ సైకిల్ రిపేరర్-2, టీఏ ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్-1, టీఏ బూట్ రిపేరర్-1, ఎంటీఎస్ ఆఫీస్ అండ్ ట్రైయినింగ్-151 పోస్టులున్నాయి.

వయో పరిమితి:

  • ఎన్డీఏ గ్రూప్-సీ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హత:

  • అభ్యర్థులు పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి, ఇంటర్ పాసై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదట ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు పోస్టింగ్ లభిస్తుంది.

జీతం:

  • ఎన్డీఏ గ్రూప్-సీ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.18,000 నుంచి రూ. 81,100 మధ్య లభిస్తుంది.

అప్లికేషన్ ఫీజు:

  • దరఖాస్తుదారులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 16-02-2024

ఎన్డీఏ అధికారిక వెబ్ సైట్:

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet