iDreamPost
android-app
ios-app

ఈ జాబ్స్ అస్సలు వదలొద్దు.. NTPCలో ఉద్యోగాలు.. నెలకు రూ. 1,60,000 జీతం

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు భారీ శుభవార్త. న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. త్వరగా అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు భారీ శుభవార్త. న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. త్వరగా అప్లై చేసుకోండి.

ఈ జాబ్స్ అస్సలు వదలొద్దు.. NTPCలో ఉద్యోగాలు.. నెలకు రూ. 1,60,000 జీతం

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. డిగ్రీ, పీజీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఏకంగా రూ. లక్షన్నరకు పైగా జీతాన్ని పొందొచ్చు. మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యమైతే ఈ జాబ్స్ ను అస్సలు మిస్ చేసుకోవద్దు. తాజాగా న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నిరుద్యోగులకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ శుభవార్తను అందించింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 100 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలక్ట్రికల్ ఎరెక్షన్, మెకానికల్ ఎరెక్షన్, సివిల్ కన్‌స్ట్రక్షన్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 03 2024 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పూర్తి వివరాలకు ఎన్టీపీసీ అధికారిక వెబ్ సైట్ https://careers.ntpc.co.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యసమాచారం :

మొత్తం పోస్టులు:

  • 100

విభాగాల వారీగా ఖాళీలు:

  • ఎలక్ట్రికల్ ఎరెక్షన్ 30, మెకానికల్ ఎరెక్షన్35, సివిల్ కన్‌స్ట్రక్షన్ 35 ఖాళీలున్నాయి.

అర్హత:

  • ఎలక్ట్రికల్ ఎరెక్షన్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
  • మెకానికల్ ఎరెక్షన్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ లేదా ప్రొడక్షన్ విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
  • సివిల్ కన్‌స్ట్రక్షన్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ లేదా కన్ స్ట్రక్షన్ విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు గరిష్టంగా 35 ఏళ్లు కలిగి ఉండాలి.

జీతం:

  • ఎంపికైన వారికి రూ. 50 వేల నుంచి రూ. 160000 వేల వరకు అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్, ఓబీసీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు రూ. 300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్య్లూడీ, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు నిచ్చారు.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులు ప్రారంభం:

  •  20-12 2023.

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 3-01 2024.

ఎన్టీపీసీ అధికారిక వెబ్ సైట్ :

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి