APETD Recruitment 2024: మంచి వేతనంతో ITIల్లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

మంచి వేతనంతో ITIల్లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఇదే మంచి అవకాశం. మంచి వేతనంతో ఐటీఐల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. త్వరగా అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఇదే మంచి అవకాశం. మంచి వేతనంతో ఐటీఐల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. త్వరగా అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మంచి వేతనంతో ఐటీఐల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలోని ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ ఒప్పంద ప్రాతిపదికన పలు ఐటీఐల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఏటీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ:35,570 జీతం అందిస్తారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బి.ఒకేషనల్‌, డిగ్రీ, డిప్లొమా, ఎన్‌టీసీ, ఎన్‌ఏసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య:

  • 71

జోన్‌ల వారీగా ఖాళీలు:

  • అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్(జోన్- I): 06
  • అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్(జోన్- II): 08
  • అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్(జోన్- III): 03
  • అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్(జోన్- IV): 54

అర్హత:

  • సంబంధిత విభాగంలో బి.ఒకేషనల్‌/ డిగ్రీ/ డిప్లొమా/ ఎన్‌టీసీ / ఎన్‌ఏసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ప్రాక్టికల్‌ డెమో, పని అనుభవం తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ:35,570 అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 1-03-2024.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 20-03-2024.

రాత పరీక్ష తేదీ:

  • 06-05-2024.
Show comments