డిగ్రీ పాసయ్యారా? కేంద్ర విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు 38,250 జీతం

నిరుద్యోగులకు కేంద్ర విద్యుత్ సంస్థ శుభవార్తను అందించింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 38 వేల వరకు జీతం అందుకోవచ్చు.

నిరుద్యోగులకు కేంద్ర విద్యుత్ సంస్థ శుభవార్తను అందించింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 38 వేల వరకు జీతం అందుకోవచ్చు.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే మంచి సమయం. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తున్నాయి. భారీ వేతనాలతో కూడిన ఈ ఉద్యోగాలను సాధిస్తే లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. తాజాగా నిరుద్యోగులకు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ అందించింది.

ఎన్పీసీఐఎల్ తాజాగా అసిస్టెంట్ గ్రేడ్-1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 58 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను అనుసరించి 12 నుంచి 38 వేల వరకు జీతం అందుకోవచ్చు. అప్లై చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

అసిస్టెంట్ గ్రేడ్ -1 మొత్తం పోస్టుల సంఖ్య : 58

అర్హత:

  • కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 21 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి..

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష, టైప్ రైటింగ్ టెస్ట్ మరియు కంప్యూటర్ ప్రొపీషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • 38,250/-.

అప్లై విధానం :

  • ఆన్ లైన్

ఫీజు :

  • అన్ రిజర్డ్వ్, ఓబీసీ, ఈడబ్య్లూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళలు అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ :

  • 05-06-2024.

అప్లికేషన్ చివరి తేదీ :

  • 25-06-2024.
Show comments