iDreamPost
android-app
ios-app

10th,ITI పాసయ్యారా? రాత పరీక్ష లేదు.. రైల్వేలో 1104 జాబ్స్ రెడీ

  • Published Jun 15, 2024 | 4:52 PM Updated Updated Jun 15, 2024 | 4:52 PM

మీరు పదోతరగతి, ఐటీఐ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. రైల్వేలో 1104 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పరీక్ష రాయకుండానే జాబ్ పొందొచ్చు.

మీరు పదోతరగతి, ఐటీఐ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. రైల్వేలో 1104 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పరీక్ష రాయకుండానే జాబ్ పొందొచ్చు.

  • Published Jun 15, 2024 | 4:52 PMUpdated Jun 15, 2024 | 4:52 PM
10th,ITI పాసయ్యారా? రాత పరీక్ష లేదు.. రైల్వేలో 1104 జాబ్స్ రెడీ

అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన భారతీయ రైల్వేలో ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీ జరుగూతూనే ఉంటుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకుంటుంది. వందలకొద్ది జాబ్స్ ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తూనే ఉంటుంది రైల్వే డిపార్ట్ మెంట్. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లైతే ఇదే మంచి అవకాశం. టెన్త్, ఐటీఐ అర్హతతోనే రైల్వేలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. తాజాగా నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

గోరఖ్ పూర్ లోని రైల్వే రిక్రూట్ మెంట్ సెల్.. నార్త్ ఈస్టర్న్ రైల్వే.. ఎన్ఈఆర్ పరిధిలోని యూనిట్లలో అప్రెంటిస్ షిప్ శిక్షణకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1104 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానికల్ డీజిల్, ట్రిమ్మర్ వంటి ట్రేడ్స్ లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎలాంటి రాత పరీక్ష లేదు. టెన్త్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్య్లూఎస్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు 11-07-2024 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల వివరాలు:

యాక్ట్ అప్రెంటిస్:

1104

వర్క్ షాప్ వారీగా ఖాళీల వివరాలు:

మెకానికల్ వర్క్ షాప్(గోరఖ్ పూర్)411, సిగ్నల్ వర్క్ షాప్(గోరఖ్ పూర్ కంటోన్మెంట్)63, బ్రిడ్జ్ వర్క్ షాప్(గోరఖ్ పూర్ కంటోన్మెంట్)35, మెకానికల్ వర్క్ షాప్(ఇజ్జత్ నగర్)151, డిజీల్ షెడ్(ఇజ్జత్ నగర్)60, క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్ నగర్)64,క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్ నవూ జంక్షన్)155, డీజిల్ షెడ్(గోండా)90, క్యారేజ్ అండ్ వ్యాగన్(వారణాసి)75.

ట్రేడ్:

ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానికల్ డీజిల్, ట్రిమ్మర్.

అర్హత:

50 శాతం మార్కులతో టెన్త్, సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసై ఉండాలి.

వయోపరిమితి:

15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.

ట్రైనింగ్ పిరియడ్:

సంవత్సరం

ఎంపిక విధానం:

టెన్త్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్య్లూఎస్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చారు.

దరఖాస్తుకు చివరి తేదీ:

11-07-2024

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş