గోల్డెన్ ఛాన్స్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3000 ఉద్యోగాలు..

గోల్డెన్ ఛాన్స్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3000 ఉద్యోగాలు..

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి భారీ శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి భారీ శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

ఇటీవల దేశంలో బ్యాంకు ఉద్యోగాల జాతర మొదలైంది. ప్రముఖ బ్యాంకులైనటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా వాటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? బ్యాంకు జాబ్స్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సెంట్రల్ ఆఫీస్ దేశవ్యాప్తంగా పలు రీజియన్లలోని శాఖల్లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 3000 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.మొత్తం పోస్టుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో 196 పోస్టులు ఉన్నాయి. డీగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 21న ప్రారంభం కాగా మార్చి 6 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ https://www.centralbankofindia.co.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

అప్రెంటిస్‌ పోస్టుల సంఖ్య:

  • 3,000

తెలుగు రాష్ట్రాల్లో:

  • ఆంధ్రప్రదేశ్‌: 100
  • తెలంగాణ: 96

శిక్షణ కాలం:

  • సంవత్సరం

అర్హత:

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 31.03.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. కేటాగిరీల వారీగా వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులు రూ.600, దివ్యాంగులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌, ధ్రువపత్రాల పరిశీలన, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి ఎంపిక చేస్తారు.

స్టైపెండ్:

  • నెలకు రూరల్/ సెమీ అర్బన్ శాఖలు రూ.15,000. పట్టణ శాఖలు రూ.15,000. మెట్రో శాఖలు రూ.15,000.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం:

  • 21.02.2024.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది:

  • 06.03.2024.

ఆన్‌లైన్ పరీక్ష తేది:

  • 10.03.2024.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్:

Show comments