P Venkatesh
మీరు ఉద్యోగాలకోసం సన్నద్ధమవుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? 2,049 పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎవరు అప్లై చేసుకోవచ్చంటే?
మీరు ఉద్యోగాలకోసం సన్నద్ధమవుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? 2,049 పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎవరు అప్లై చేసుకోవచ్చంటే?
P Venkatesh
ఉద్యోగాలు సాధించాలనే ఆసక్తి అందికీ ఉంటుంది.. కానీ ఆ శక్తి మాత్రం కొందరికే ఉంటుంది. ఎవరైతే నిరంతరం కృషి చేస్తారో.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుదిరగక లక్ష్యం వైపు పయనిస్తారో వారే జీవితంలో సక్సెస్ అవుతారు. మరి ఇప్పుడు మీరు కలలుగన్న జీవితాన్ని పొందే అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ వెలువడింది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. వందలు కాదు ఏకంగా వేలల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మచి వేతనంతో కూడిన ఈ ఉద్యోగాలను సాధిస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోక పోతే ఏడ్చినా లాభం లేదు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు భారీ శుభవార్త. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) వివిధ కేంద్రం ప్రభుత్వ విభాగాల్లో సెలక్షన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 2049 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు గల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 26న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 18లోపు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, తదితర పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్ సైట్ https://ssc.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.