iDreamPost
android-app
ios-app

BTech పాసైతే చాలు.. ప్రభుత్వ ఉద్యోగాలు రెడీ.. నెలకు 35 వేల జీతం

Iffco Recruitment 2024: మీరు బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 35 వేల జీతం పొందొచ్చు.

Iffco Recruitment 2024: మీరు బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 35 వేల జీతం పొందొచ్చు.

BTech పాసైతే చాలు.. ప్రభుత్వ ఉద్యోగాలు రెడీ.. నెలకు 35 వేల జీతం

బీటెక్ పూర్తయ్యాక చాలా మంది ఐటీ సెక్టార్ లో స్థిరపడాలని చూస్తుంటారు. లక్షల్లో జీతాలు, వీకెండ్ సెలవులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో వర్క్ ఉండడంతో సాఫ్ట్ వేర్ జాబ్ పై ఇంట్రెస్టు చూపిస్తుంటారు బీటెక్ గ్రాడ్యుయేట్స్. అయితే ఇటీవల ఐటీరంగంలో లేఆఫ్స్ అందరిని కలవరానికి గురిచేస్తున్నాయి. ఎప్పుడు జాబ్ ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. కొత్త రిక్రూట్ మెంట్ కూడా జరగడం లేదు. ఇలాంటి తరుణంలో బీటెక్ పాసైన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. బీటెక్ అర్హతతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ప్రధాన కార్యాలయం- గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ టెస్ట్, ఫైనల్ ఆన్ లైన్ టెస్టు, పర్సనల్ ఇంటర్య్వూ, సర్టిఫికేషన్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 35 వేల జీతం అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ పోస్టులు

విభాగాలు:

  • కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్.

అర్హత:

  • సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం:

  • ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ టెస్ట్, ఫైనల్ ఆన్ లైన్ టెస్టు, పర్సనల్ ఇంటర్య్వూ, సర్టిఫికేషన్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 35 వేలు అందిస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 31-07-2024

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş