ITBP Recruitments 2024: ITBP రిక్రూట్ మెంట్.. నెలకు రూ. 25000–81000 వేల జీతంతో లైఫ్ సెటిల్ అయ్యే ఛాన్స్

ITBP రిక్రూట్ మెంట్.. నెలకు రూ. 25000–81000 వేల జీతంతో లైఫ్ సెటిల్ అయ్యే ఛాన్స్

ITBP Recruitments 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. 81 వేల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.

ITBP Recruitments 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. 81 వేల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.

సాధించాలనే తపన ఉంటే చాలదు.. దానికి తగిన కృషి చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు కన్న కలల్ని నిజం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఉద్యోగం సాధించాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే దాన్ని నిజం చేసుకుంటుంటారు. సరైన లక్ష్యం.. డెడికేషన్ ఉంటే గవర్నమెంట్ జాబ్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. మరి మీలో కూడా ప్రభుత్వ కొలువు కొట్టాలనే కసి ఉందా? అయితే ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 81 వేల జీతం పొందొచ్చు.

ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) వివిధ విభాగాల్లో హెడ్‌ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 128 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి ఇంటర్, టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. పురుష, మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి అభ్యర్థుల వయసు 18-27 ఏళ్లు ఉండాలి. ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), రాతపరీక్ష,ఒరిజనల్‌ డాక్యుమెంట్ల వెరిఫికేషన్,మెడి కల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య: 128.

విభాగాల వారీగా ఖాళీలు:

  • హెడ్‌ కానిస్టేబుల్‌(డ్రెస్సర్‌ వెటర్నరీ)–09, కానిస్టేబుల్‌ (యానిమల్‌ ట్రాన్స్‌పోర్ట్‌)–115, కానిస్టేబుల్‌(కెన్నెల్‌మ్యాన్‌)–04.

అర్హత:

  • హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 12వ తరగతితోపాటు పారా వెటర్నరీ కోర్సు లేదా డిప్లొమా లేదా వెటర్నరీ సర్టిఫికేట్‌ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. కానిస్టేబుల్‌ పోస్టులకు మెట్రిక్యులేషన్‌/పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.

వయోపరిమితి:

  • 10.09.2024 నాటికి హెడ్‌ కానిస్టేబుల్‌/కానిస్టేబుల్‌(కెన్నెల్‌మన్‌) పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్‌(యానిమల్‌ ట్రాన్స్‌పోర్ట్‌)పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), రాతపరీక్ష,ఒరిజనల్‌ డాక్యుమెంట్ల వెరిఫికేషన్,మెడి కల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

జీతం:

  • నెలకు హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.25,500–రూ.81,100. కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700–రూ.69,100 జీతం లభిస్తుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తు ప్రారంభతేది:

  • 12-08-2024

దరఖాస్తులకు చివరితేది:

  • 10-09-2024
Show comments