యూనియన్ బ్యాంక్ లో 500 జాబ్స్.. మంచి జీతం.. ఇప్పుడే అప్లై చేసుకోండి

UBI Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. యూనియన్ బ్యాంక్ లో 500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు.

UBI Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. యూనియన్ బ్యాంక్ లో 500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు.

బ్యాంక్ జాబ్స్ కు ఇచ్చే ఇంపార్టెన్స్ వేరు. మంచి జీతంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు, సెలవులు ఎక్కువగా ఉండడంతో బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలని చూస్తుంటారు. కోచింగ్ తీసుకుని మరి బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న యూబీఐ శాఖల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నది.

యూబీఐ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 500 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 50 పోస్టులు, తెలంగాణలో 42 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వాళ్లకు నెలకు నెలకు రూ.15,000 స్టైపెండ్‌ కూడా ఇస్తారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు కనిష్టంగా 20, గరిష్టంగా 28 ఏళ్లు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 17 వరకు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్య సమాచారం :

మొత్తం అప్రెంటిస్ ఖాళీలు : 500

అర్హతలు:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు కనిష్టంగా 20, గరిష్టంగా 28 ఏళ్లు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • ఆన్‌లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

స్టైఫండ్:

  • నెలకు రూ.15,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్‌/ ఓబీసీలకు రూ.800. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ.600. దివ్యాంగులకు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్‌

దరఖాస్తులు ప్రారంభ తేదీ:

  • 28-08-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 17-09-2024
Show comments