iDreamPost
android-app
ios-app

స్పోర్ట్స్ బాగా ఆడుతారా? చదువుతో సంబంధం లేకుండా రైల్వేలో జాబ్స్! మిస్ చేసుకోకండి!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. పదోతరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటఫికేషన్ రిలీజ్ అయ్యింది.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. పదోతరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటఫికేషన్ రిలీజ్ అయ్యింది.

స్పోర్ట్స్ బాగా ఆడుతారా? చదువుతో సంబంధం లేకుండా రైల్వేలో జాబ్స్! మిస్ చేసుకోకండి!

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే నేటి రోజుల్లో ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. పోటీ పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబరిస్తే తప్పా జాబ్ దక్కించుకోలేరు. దీనికోసం ప్రణాళికబద్దంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబం భవిష్యత్ స్వరూపమే మారిపోతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న వారికి భారతీయ రైల్వే గుడ్ న్యూస్ అందించింది. పలు ఉద్యోగాల భర్తీకి నార్తర్న్ రైల్వే జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పదో తరగతి అర్హతతోనే రైల్వేలో ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు వారు మాత్రమే అర్హులు.

రైల్వే శాఖ నిత్యం ఏదో ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో న్యూ ఢిల్లీలోని రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నార్తర్న్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 38 పోస్టులను భర్తీ చేయనున్నది. కాగా ఈ ఉద్యోగాలకు క్రీడాకారులు మాత్రమే అర్హులు. నోటిఫికేషన్ లో నిర్దేశించిన క్రీడాంశాల్లో ప్రతిభకనబరిచిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

స్పోర్ట్స్ కోటా గ్రూప్ డీ మొత్తం పోస్టులు:

  • 38

క్రీడాంశాలు:

  • ఫుట్ బాల్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ, కబడ్డీ, రెజ్లింగ్, చెస్ తదితర క్రీడలు.

అర్హత:

  • అభ్యర్థులు పదోతరగతిలో పాసై ఉండాలి. దీంతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో ప్రతిభ చూపి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 01-07-2024 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీలు, ఈబీసీ, అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. ఇతరులు రూ. 400 చెల్లించాలి.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 16-04-2024

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:

  • 16-05-2024