Keerthi
ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నిరుద్యోగుల గురించి ప్రభుత్వం ఓ చక్కని నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నిరుద్యోగుల గురించి ప్రభుత్వం ఓ చక్కని నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Keerthi
ఆరోగ్యశ్రీ పథకం గురించి అందరికి తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో ఆరోగ్య శ్రీ పథకం కూడా ఒకటి. ఎన్ని పథకాలు ఉన్న ఆరోగ్యశ్రీ పథకం అనేది పేదవాడికి వెన్ను ముక్క వంటింది. అందుకే రెండు తెలుగు రాష్ట్రంలో ప్రభుత్వం దీనిని అమలు పరచింది. అలాగే పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించి ఉచిత అందిస్తోంది. ఈ ఆరోగ్య శ్రీ ద్వారా ఆనారోగ్యంకి గురియైన, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఎటువంటి నిబంధనలు లేకుండా చికిత్స అందేలా వర్తిస్తుంది. అలాగే ఆసుపత్రుల్లో నగదు రహిత పద్ధతిలో ఔట్ పేషెంట్ చికిత్సను అందిస్తాయి. ఇదిలా ఉంటే.. ఈ ఆరోగ్య శ్రీ పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఆరోగ్యశ్రీ పరిధిలో ప్రభుత్వం నిరక్షరాస్యులైన పేదలను ఉద్దేశించి ఆరోగ్య మిత్ర అనే పథకాన్ని అమలు చేశారు. ఆ ఆరోగ్య మిత్ర అంటే ఆరోగ్య స్నేహితుడు అని అర్ధం. ఈ ఆరోగ్య మిత్రలు ఆనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు మానసిక ధైర్యం అందించడంతో వారికి సహాయకులుగా వ్యవహరిస్తారు. అయితే తాజాగా వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలలో ఖాళీగా ఉన్న రెండు వేరు వేరు పోస్టులను భర్తీ చేసేందుకు ఆరోగ్య మిత్ర జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఒంగోలులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డాక్టర్ రాజ్యలక్ష్మి కీలక ప్రకటన చేశారు.
ఆరోగ్య మిత్ర ఉద్యోగ ఖాళీలు మొత్తం 17 ఉండగా.. టీం లీడర్స్ ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. ఇక దీనికి ఆఫ్ లైన్ విధానంలో కూడా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే prakasam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, ఆసక్తి ఉన్నవాళ్లు జిల్లా సమన్వయ కర్త, డాక్టర్ వైస్సార్ ఆరోగ్య శ్రీ కార్యాలయము, ఓల్డ్ రిమ్స్ హాస్పిటల్, ఒంగోలు అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. అర్హత కలిగిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే భారీ వేతనం పాటు మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఏదైనా సందేహాం ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.